YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారత్ బలం.. బలగమెంత

భారత్ బలం.. బలగమెంత
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   
భారత్-పాకిస్తాన్ ల మధ్య సంబంధాలు పూర్తిగా సంక్షోభంలో పడిన పరిస్థితి. భారతీయులైతే.. పాక్ తో యుద్ధం చేయాల్సిందే అంటున్నారు. పాక్ పెంచి పోషించిన ఉగ్రవాదులు 40మందికి పైగా సైనికులను పొట్టనపెట్టుకోవడమే దీనికి కారణం. పుల్వామాలో జేషే మహ్మద్ తీవ్రవాదులపైశాచిక దాడితో దేశం రగిలిపోతోంది. ఎన్నాళ్లిలా అంటూ ప్రతీ భారతీయుడి మనసు ఆక్రోశిస్తోంది. భరతమాత ఇంకెంతమంది తన ముద్దు బిడ్డల్ని పోగొట్టుకోవాల్సి ఉందని ప్రశ్నిస్తోంది. ఈ ఆవేదనతోనే పాక్ కు గుణపాఠం చెప్పాల్సిందేనని అంతా అంటున్నారు. కాలనాగులాంటి దాయాదిని కంట్రోల్ చేయాలంటే భారత్ కఠినంగానే ఉండాలని స్పష్టంచేస్తున్నారు.భారత్-పాకిస్తాన్ లు అణ్వాయుధ దేశాలు. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు హెచ్చు స్థాయిలో ఉన్నప్పుడు జనాలు హడలిపోతుంటారు. దీనికీ ఓ కారణం ఉంది. భారత్ తనకు తానుగా తొలిగా న్యూక్లియర్ వెపన్ ప్రయోగించనని ఇదివరకే స్పష్టం చేసింది. అయితే పాక్ ఇలాంటి కండిషనేదీ పెట్టుకోలేదు. అంతేకాదు... గతంలో మనపై అణ్వాయుధ దాడి చేయాలని భావించింది. దీంతో పాక్ రెచ్చిపోయి అణుదాడి చేస్తే పరిస్థితి ఏంటనే భయం అందరిలోనూ ఉంది. 
ఇండోపాక్ వార్ గనుక వస్తే.. మనదే పైచేయి
 భారత్ క్రియాశీలక సైన్యం 13లక్షల 62 వేల 500. పాకిస్తాన్ బలం 6లక్షల37వేలు మాత్రమే.
పాక్ తో పోల్చితే భారత్ కే యుద్ధ విమానాల సంఖ్య ఎక్కువ. మనకు 2వేల 185 వార్ జెట్స్ ఉండగా పొరుగుదేశానికి 12వందల 81మాత్రమే ఉన్నాయి.  
సైనిక హైలికాఫ్టర్లలోనూ భారత్ దే పైచేయి. మనకు 720 ఉండగా.. పాక్ కు 328 ఉన్నాయి.
యుద్ధ ట్యాంకుల విషయానికి వస్తే.. భారత్ కు 4వేల 426 ఉన్నాయి. పాకిస్తాన్ కు 2వేల 182 ఉన్నాయి.
నేవీ ఫోర్స్ లోనూ భారత్ బలంగా ఉంది. మనకు 295 యుద్ధ నౌకలు ఉండగా.. పాక్ కు 197 ఉన్నాయి. 
అణువార్ హెడ్స్ లో మాత్రం పాకిస్తాన్ ది పైచేయిగా ఉంది. పాక్ కు 145 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉండగా.. భారత్ కు 135 ఉన్నాయి. 
రక్షణ బడ్జెట్ విషయానికి వస్తే.. భారత్ 3 పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లను వెచ్చిస్తోంది. పాకిస్తాన్ లక్ష కోట్లను కేటాయిస్తోంది.  భారత్-పాకిస్తాన్ ను ఒకప్పుడు ఏకదేశం. హిందుస్తాన్ గా ప్రపంచంలో తన ప్రత్యేకతను చాటుకుంది. అయితే వివిధ కారణాలతో 1947లో విభజన జరిగింది. తన నుంచి విడివడిన పాకిస్తాన్ పై భారత్ కు సోదరభావమే ఉంది. కానీ.. పాక్ మాత్రం ద్వేష భావంతో రగిలిపోతోంది. ఈ విద్వేషంతోనే ఏడు దశాబ్దాలుగా భారత్ ను రక్తసిక్తం చేసే కుయుక్తులు సాగిస్తోంది. పాక్ కుతంత్రాలను మనదేశం సహిస్తోంది. అయితే సహనానికీ ఓ హద్దు ఉంటుందని ప్రస్తుతం భరత జాతి ఎలుగెత్తుతోంది. ఉగ్రవాదానికి కొమ్ము కాస్తూ.. ఉన్మాదిగా మారిన పాక్ కు బుద్ధి చెప్పాలని స్పష్టం చేస్తోంది.   భారత్ అంటే పాకిస్తాన్ కు ఓ రకమైన ఇన్ సెక్యూరిటీ. ఈ ఆత్మన్యూనతతోనే మనపై అక్కసు పెంచుకుంది. భారత్ ను తీవ్రవాద దేశంగా చిత్రీకరించేందుకు దాయాది చేయని ప్రయత్నంలేదు. ఈ క్రమంలోనే తమ దేశంలోనే ఉగ్రవాదుల అడ్డాలు తెరచింది. తీవ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తూ భారత్ లోకి ముష్కర మూకలను పంపుతోంది. అందుకే భూతల స్వర్గం నిత్యం గన్ ఫైర్ తో దద్దరిల్లుతోంది. పాక్ దుర్నీతికి అడ్డుకట్టపడాలంటే మనమూ దూకుడుగానే వ్యవహరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.యుద్ధంతోనే భారత్-పాకిస్తాన్ వివాదాల పరిష్కారం కావు. కానీ పాక్ లాంటి దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలంటే పోరాటమే మందని చాలామంది అంటున్నారు. ఒక్కసారి భారత్ తన కఠినత్వాన్ని చూపితే.. పాకి దారికి వస్తుందని అభిప్రాయపడుతున్నారు.ఆయుధ సంపత్తి పరంగా భారత్ దే పైచేయి. పాకిస్తాన్ మన దరిదాపుల్లో లేదు. మన మిలటరీ పటిష్టమైంది కాబట్టే పాక్ నేరుగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీస్తుంటుంది. ఉగ్రవాదులను ఎగదోస్తూ దేశంలో కల్లోలం సృష్టించేందుకు యత్నిస్తోంది. పాక్ కుటిల నీతికి చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందని అంతా అంటున్నారు. అందుకే దాయాది వెన్నుపోట్లకు ఒక్క దెబ్బతో బుద్ధి చెప్పాలని తేల్చి చెప్తున్నారు..

Related Posts