YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

కల్లు తాగిన కోతిలా పాకిస్తాన్

కల్లు తాగిన కోతిలా పాకిస్తాన్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   

భారత వైమానిక దాడులతో పాకిస్థాన్ పరిస్థితి కల్లుతాగిన కోతిలా తయారయ్యింది. తమ భూభాగంలో భారత యుద్ధ విమానాలు ఎలాంటి దాడులకు పాల్పడలేదని ప్రకటించి, అంతలో తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది. మంగళవారం సాయంత్రం నుంచి సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. రాజౌరీ, నౌషెరా, పూంచ్ సెక్టార్లలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన దాయాది, బుధవారం మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. పాక్ వాయుసేనకు చెందిన మూడు యుద్ధ విమానాలు పూంచ్, నౌషెరా సెక్టార్లలోకి చొరబడ్డాయి. దీంతో అప్రమత్తమైన వైమానిక దళం వీటిని తిప్పికొట్టింది. ఈ క్రమంలో పాక్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు భారత అధికారులు పేర్కొన్నారు. ఇందులోని పాక్ పైలట్ పారాచ్యూట్ సాయంతో తప్పించుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.  జమ్మూ కశ్మీర్‌‌లోని బుడ్గామ్‌లో ఐఏఎఫ్ విమానం కూలిపోవడంతో జమ్మూ, శ్రీనగర్, లేహ్ విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ విమానాశ్రయాల నుంచి ప్రయాణించే అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు రక్షణ శాఖ ప్రకటించింది. అలాగే శ్రీనగర్ తదితర విమానాశ్రయాలకు చేరుకోవాల్సిన విమానాలను దారి మళ్లించామని తెలిపింది. అయితే, అత్యవసరంగా విమానాశ్రయాలను మూసివేయడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు. అమృత‌సర్ విమానాశ్రయాన్ని సైతం మూసివేశారు. అనివార్య కారణాల వల్ల విమాన సేవలను రద్దుచేశఆమని, వాణిజ్య విమానాల రాకపోకలను నిలిపివేశామని అమృత‌సర్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఏపీ ఆచార్య పేర్కొన్నారు. కాగా, తమ దేశంలోని అన్ని విమానాశ్రయాలనూ తక్షణం మూసివేస్తున్నట్టు పాకిస్థాన్ కొద్దిసేపటి కిందట ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేశామని వెల్లడించింది. లాహోర్, ముల్తాన్, ఇస్లామాబాద్, ఫైసలాబాద్, సియాల్ కోట్ తదితర ఎయిర్ పోర్టులను మూసివేయాలని, తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ తెరవరాదని స్పష్టం చేశారు. అలాగే, ఇప్పటికే గాల్లో ఉన్న విమానాలను తక్షణమే సమీపంలోని ఎయిర్ పోర్టుల్లో దింపేయాలని ఆదేశించింది. విమానాశ్రయాలన్నీ సైన్యం అధీనంలోకి వెళ్లిపోయాయని, ప్రస్తుతానికి వారి విమానాల సేవలకే పరిమితమని వెల్లడించింది. పాక్ ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Related Posts