Highlights
- దక్షిణాదిన ఊహాతీత పరిణామాలు
- ఏకమవుతున్న బీజేపీ వ్వతిరేక శక్తులు
- చక్రం తిప్పుతున్న చంద్రబాబు
దక్షిణాది రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రంలో ఆయా ప్రాంతీయ పార్టీకి పట్టు ఉంది. ఏపీలో టీడీపీ, వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, కర్నాటకలో జేడీఎస్, తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకేలకు పట్టు ఉంది. అయితే సౌతిండియా కన్నేసిన నేపథ్యంలో సంయుక్తంగా చెక్ పెట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.దక్షిణాదిని కేంద్రం మరోలా చూస్తుందని ఇప్పటికే కమల్, పవన్ కళ్యాణ్ వంటి వారు భావిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ఏపీకి అన్యాయం జరుగుతోందని, ఏపీ ఏమైనా ఈ దేశంలో భాగం కాదా అంటున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీతో పాటు కాంగ్రెస్‌కు చెక్ చెప్పేందుకు, కేంద్రంలో దక్షిణాది చక్రం కోసం ఏమైనా జరగవచ్చునని అంటున్నారు.కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలకు దూరంగా ఉండే దక్షిణాది నాయకులు ఒక్కటవుతున్నారా అనే చర్చ తెరపైకి వస్తోంది. కేరళలో లెఫ్ట్, తమిళనాడులో కమల్ హాసన్, ఇతరులు, ఏపీలో చంద్రబాబు (బీజేపీని కాదనుకొని బయటకు వస్తే)లు ఏకతాటి పైకి వస్తారా అనే చర్చ సాగుతోంది. మరో విషయం ఏమంటే.. మీ సిద్ధాంతాలు, నా సిద్ధంతాలు వేరు అని కూడా కమల్-చంద్రబాబుల మధ్య సంభాషణ జరిగినట్లుగా చెప్పారు. దీంతో ఏం జరుగుతుందనేది చూడాలని అంటున్నారు.
ఓ రాష్ట్రం నాయకులు ఇతర రాష్ట్రాల్లో ప్రభావం చూపగలరా అనే అనుమానం కొందరికి రావొచ్చు.లోకనాయకుడు కమల్ హాసన్‌కు ఉన్న అభిమాన గణం గురించి చెప్పాల్సిన పని లేదు. బతుకు దెరువు కోసం ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి వెళ్లిన వారు చాలామంది ఉన్నారు. గత కర్నాటక ఎన్నికల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి వారు ప్రచారం చేసిన విషయం తెలిసిందే.కమల్ హాసన్ చాలాకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. రాజకీయాల్లోకి వస్తానని తేలిపోయాక దాడి పెంచారు. ఓ వైపు తమిళనాడులో అధికార పార్టీపై విమర్శలు చేస్తూనే బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. అలాంటి కమల్ హాసన్ బీజేపీ మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబును ప్రశంసించారు.బుధవారం పార్టీ ప్రకటన సమయంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. చంద్రబాబు మంగళవారం తనతో ఫోన్లో మాట్లాడారని, ఈ సందర్భంగా ప్రజలకు ఏం చేయాలనే విషయాలపై సలహాలు ఇచ్చారని, ఇతర అంశాల గురించి ఆందోళన చెందవద్దని చెప్పారని వ్యాఖ్యానించారు. తన హీరో చంద్రబాబు అన్నారు.
ఇదిలా ఉండగా శుక్రవారం నాటికి చంద్రబాబు కేంద్రంపై మరో అడుగు ముందుకేశారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని, అరకొర సాయం చేశారని, ఏపీకి న్యాయం చేయాలని గట్టిగా అడుగుతున్నానని అల్టిమేటం జారీ చేశారు.