యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో మంత్రి నారా లోకేష్ తో ఏడక్కో గ్రూప్ కంపెనీ కంట్రీ హెడ్ మార్కో వాల్సెచి చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ బాలాజీ స్వామినాథన్ భేటీ అయ్యారు.స్విట్జర్లాండ్ కి చెందిన ఏడక్కో ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒక్కటి, ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో కార్యకలాపాలు, 5,100 బ్రాంచ్ లు, 33 వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు.టెంపరరీ స్టాఫింగ్,పర్మినెంట్ ప్లేస్మెంట్,నైపుణ్య అభివృద్ధి,ఔట్ సోర్సింగ్,కన్సల్టింగ్ సర్వీసెస్ ని ఏడక్కో అందిస్తుంది.ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం అభివృద్ధి కి తీసుకున్న చర్యల గురించి మంత్రి నారా లోకేష్ కంపెనీ ప్రతినిధులకు వివరించారు.ఐటీ రంగం అభివృద్ధి కి తీసుకొచ్చిన పాలసీలు,రాయితీల గురించి వివరించారు.హెచ్సిఎల్,అదాని లాంటి పెద్ద కంపెనీలు రాష్ట్రానికి రావడానికి ప్రభుత్వం ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుందో ఏడక్కో ప్రతినిధులకు వివరించారు.ఏడక్కో కంపెనీ కి ఇండియాలో పెద్ద ఎత్తున వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన ఉంది అని అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం అని మార్కో వాల్సెచి మంత్రి కి తెలిపారు.ఐటీ ఎనేబుల్డ్ సర్వీసులు,హెచ్ఆర్ సొల్యూషన్స్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ లో కంపెనీ ఏర్పాటు చెయ్యాలి అనుకుంటున్నాం.దీనికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం కావాలి అని ఏడక్కో కంపెనీ ప్రతినిధులు కోరారు.కంపెనీ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తాం అని మంత్రి నారా లోకేష్ తెలిపారు.అలాగే ప్రపంచ వ్యాప్తంగా వివిధ పెద్ద కంపెనీలకు మానవ వనరులను అందిస్తున్న ఏడక్కో కంపెనీ ఆంధ్రప్రదేశ్ యువతకి అధునాతన టెక్నాలజీల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సహకరించాలి అని మంత్రి నారా లోకేష్ కోరారు.ఐటీ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు,అధునాతన టెక్నాలజీలు,నైపుణ్య అభివృద్ధి లో పూర్తి సహకారం అందిస్తాం అని మార్కో వాల్సెచి అన్నారు