యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తెలుగు న్యూస్ ఛానెల్స్.. సుమారు తెలుగులో ఎనిమిది నుంచి పది వరకు న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి.. ప్రతి ఛానల్ ఏదో ఒక రాజకీయ పార్టీ కి భజన చేస్తూ, సమాజానికి ఉపయోగపడే వార్తలు ప్రచారం చేయకుండా అధికార పక్షం అక్కడ ఆ పని చేసింది, ప్రతి పక్షం ఇక్కడ ఈ పని చేసింది అంటూ భజన చేస్తారు. మరో వైపు రిటైర్ అయినా వారిని, రేపో మాపో పోయేవాళ్లను కెమెరా ముందుకి తీసుకొచ్చి డిబేట్లు పెడతారు. ఏ ఒక ఛానల్ సామజిక స్పృహ తో పనిచేయకుండా 'టి ఆర్ పి' రేటింగ్లు కోసం అడ్డమైన కార్యక్రమాలు ప్రచారం చేస్తారు. కొన్ని ఛానల్ అయితే మర్మ రహస్యం, ప్రణయ బీభత్సం, వామ్మో ఏదో అవుతుంది, జరా హుషార్ అంటూ ఎవరికీ పనికిరాని ప్రోగ్రాములు టెలికాస్ట్ చేస్తారు.
ప్రతి ఒక్కరు వార్తలు చూసేది నలుముళ్ళలా ఏమి జరుగుతుంది, అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అని కానీ కాలక్షేపానికి, వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినడానికి కాదు. కనుక ప్రతి ఒక న్యూస్ ఛానల్ యాజమాన్యం సామజిక బాధ్యతతో నలుగురికి ఉపయోగపడే వార్తలు ప్రసారం చేస్తారని ప్రతి పాఠకుడి కోరిక.
ఈ మధ్యకాలంలో జరిగిన ఉగ్రవాదుల దాడి కోసం, సర్జికల్ స్ట్రైక్ కోసం జాతీయ, అంతర్జాతీయ న్యూస్ ఛానెల్స్ ప్రసారం చేస్తూ మన దేశం కోసం సరిహద్దులలో జవాన్లు చేసిన త్యాగం కోసం చూపిస్తూ.. ప్రతి భారతీయుడులో చైతన్యం తీసుకొచ్చి ఆర్మీ లోకి జాయిన్ అవడానికి ఎంతగానో ప్రోహాత్సహిస్తునారు. కానీ మన తెలుగు న్యూస్ ఛానెల్స్ వయస్సు అయిపోయినవాళ్లతో డిబేట్లు, ఎందుకు పనికిరానివాళ్ళతో ఇంటర్వ్యూలు, అనవసరమైన విషయాలకు లైవ్ పెట్టడం వంటివి చూపించి అసలైన వార్తలను గాలికి వదిలేస్తున్నారు. ఇప్పటికైనా మన న్యూస్ ఛానెల్స్ మేల్కుని నలుగురికి ఉపయోగపడే వార్తలు ప్రసారం చేయాలనీ మా విన్నపం.