యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విశాఖ కేంద్రంలో నూతన రైల్వేజోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ అధికారికంగా ప్రకటించారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో ఈ జోన్ ఏర్పాటు చేస్తామని, ఈ జోన్ కు ‘సౌత్ కోస్ట్ రైల్వే’గా నామకరణం చేసినట్టు గోయల్ చెప్పారు. రైల్వేజోన్ ఏర్పాటుకు సంబంధించిన మిగిలిన కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేస్తామని, భాగస్వాములు అందరితో చర్చించామని, ఈ దిశగా అధికారిక చర్యలు తీసుకుంటామని చెప్పారు.