YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రఘవీరా...కు దారెటు...

 రఘవీరా...కు దారెటు...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఎన్ ర‌ఘువీరా రెడ్డి. ఏపీ రాజ‌కీయాల్లో చాలా సీనియ‌ర్‌. గ‌తంలో వైఎస్ హ‌యాంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. అయితే, ఇప్పుడు విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ, త‌ర‌చుగా ఆయ‌న చేస్తున్న కామెంట్లు, చేస్తున్న విమ‌ర్శ‌లు అస‌లు ఆయ‌న ఏపార్టీకి అద్య‌క్షుడు? అనే ప్ర‌శ్న‌ను తెర‌మీదికి తెస్తోంది. ప్రధాని మోడీ దగ్గర మోకరిల్లుతున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌.. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని రఘువీరారెడ్డి విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా ప్రజా భరోసా యాత్ర ప్రారంభమైంది..‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని ప్రకటించాలని మేం కోరితే ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. మోడీ కోరకపోయినా తానే ముందుకు వెళ్లి మద్దతు తెలపడం ఏమిటి? పైగా ఇటీవల రాష్ట్రంలో జరిగిన మోడీ సభకు ఏకంగా జగన్‌ తమ నేతలు, కార్యకర్తలను తరలించడం విడ్డూరంగా ఉంది. మోడీకి ఊడిగం చేసే బదులు వైసీపీని బీజేపీలో విలీనం చేయాలి’ అని సలహా ఇచ్చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ర‌ఘువీరా కాగితం చ‌ప్పుళ్లు అదిరిపోయాయి. అయితే, నిజ‌మైన కాంగ్రెస్‌కు రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉండి ఉంటే.. ముందు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు జ‌రుగుతున్న అన్యాయంపై ఎందుకు మౌనం వ‌హిస్తున్నాడ‌నేది ప్ర‌శ్న‌.ఒక‌ప‌క్క కాంగ్రెస్‌తో చెలిమి అంటూనే చంద్ర‌బాబు ఆపార్టీకి తూట్లు పొడుస్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ కాంగ్రెస్ సీనియ‌ర్ల‌ను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఒక ప‌క్క‌, రాహుల్ గాంధీకి ప‌ట్టు శాలువా క‌ప్పి.. రాష్ట్ర కాంగ్రెస్ నెత్తిన న‌ల్ల గుడ్డ క‌ప్పుతు న్నారు చంద్ర‌బాబు మ‌రి దీనిని ప్ర‌శ్నించాల్సిన ర‌ఘువీరా ఇప్ప‌టి వ‌రకు మౌనం వ‌హిస్తూ.. చంద్ర‌బాబు ను ఒక్క మాట కూడా అన‌కుండా రాష్ట్రంలో తాము అధికారంలోకి వ‌స్తామ‌ని ఎలా చెప్ప‌గ‌లుగుతున్నార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. అంతేకాదు, పార్టీని వీడి వెళ్లిపోతున్న కేంద్ర మాజీ మంత్రుల‌ను సైతం ఆప‌లేని నిర్భాగ్య స్థితిలో ఉన్న ర‌ఘువీరా బ‌లంగా ఉన్న వైసీపీని విమ‌ర్శించే అర్హ‌త ఎక్క‌డ ఉంటుంది? అనేది మ‌రో ప్ర‌శ్న‌. మొత్తానికి ర‌ఘువీరా వైఖ‌రిపై సొంత పార్టీలోనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Related Posts