యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పుల్వామాలో ఆత్మాహుతి దాడి చేసి 40 మందికి పైగా భారత జవాన్లను బలిగొనడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ దాడికి ప్రతీకారంగా సరిగ్గా 12వ రోజు పాకిస్తాన్ పరిధిలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి 300కు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దీనిని జీర్ణించుకోలేకపోతోంది. భారత్ కు సమాధానం చెబుతామని బీరాలు పలుకుతోంది. భారత్ – పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాల బలగాలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాలను మూసివేసి విమాన రాకపోకలను నిలిపివేశారు. సరిహద్దులలోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతాధికారులు, మంత్రులతో సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని కూడా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చాయి. వీటిని భారత బలగాలు తిప్పికొట్టాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ కు చెందిన ఓ యుద్ధ విమానం, భారత్ కు చెందిన ఓ యుద్ధవిమానం కూలిపోయాయి. అభినందన్ అనే ఒక భారత పైలట్ పాకిస్తాన్ ఆర్మీకి చిక్కారు. పూర్తిగా భారత్ – పాక్ సరిహద్దులో యుద్ధ వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధం కనుక వస్తే పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది. భారత్ బలమెంత ? పాకిస్తాన్ శక్తి ఎంత ? మనకు ఏయే దేశాల మద్దతు ఉంటుంది ? పాకిస్తాన్ వైపు ఎవరు ఉంటారు ? అనే ప్రశ్నలు ప్రజల్లో వస్తున్నాయి. పాకిస్తాన్ తో గనుక యుద్ధం వస్తే పాకిస్తాన్ కంటే భారత్ ఎంతో మెరుగ్గా ఉంటుంది. భారత సైనిక శక్తి, ఆయుధ సంపత్తి పాకిస్తాన్ కంటే చాలా ఎక్కువ. దీనికి తోడు పాకిస్తాన్ కంటే భారత్ కు ఎక్కువ దేశాల మద్దతు ఉంటుంది. కాబట్టి ఏ రకంగా చూసినా పాకిస్తాన్ కంటే భారత్ చాలా మెరుగ్గా ఉంది. ఈ విషయాన్ని మూడు యుద్ధాల్లో ఓడించి భారత్ ఇప్పటికే పాకిస్తాన్ కు తెలియజేసింది.
భారత్, పాకిస్తాన్ సైనిక, ఆయుధ బలాబలాలు
భారత్ పాకిస్తాన్
సైన్యం 1,362,500 6,37,000
రిజర్వ్ బలగాలు 2,844,750 2,82,000
ఎయిర్ క్రాఫ్ట్ లు 2,185 1,281
హెలీకాఫ్టర్లు 720 328
యుద్ధ విమానాలు 320 180
యుద్ధ ట్యాంకులు 4426 2182
శతఘ్నులు 4148 1240
రాకెట్ ప్రొజెక్టర్లు 266 144
విమాన వాహక నౌకలు 1 0
సబ్ మెరైన్లు 16 5
యుద్ధ నౌకలు 14 10