భారతీయ వాయుసేన పైలట్ అభినందన్ దేశభక్తి నిరుపమానం. రక్తం కారుతున్నా ధైర్యం చెక్కుచెదరలేదు. హింసించినా ధైర్యంగా నిలబడ్డాడు. అభినందన్ దేశభక్తి మనందరికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఉదయం అయన ఎలక్షన్ మిషన్ 2019పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, బూత్ కన్వీనర్లు పాల్గోన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ అభినందన్ కుటుంబానికి అందరూ అండగా ఉండాలి. భారత వైమానిక దళం ధైర్యసాహసాలను ప్రశంసించాలి. సరిహద్దుల్లో మన సైన్యం వీరోచిత పోరాటం చేసారు. కేంద్రంలో పాలకులు బాధ్యతాయుతంగా ఉండాలి. ఒక వ్యక్తి నిర్ణయాలు దేశ భవిష్యత్తును నిర్ధారిస్తాయి. ఏకపక్షంగా వ్యవహరిస్తే చాలా ఇబ్బందులు వస్తాయని అయన అన్నారు. దేశం మనోగతాన్ని బట్టి నడుచుకోవాలి. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలి. ఇందులో రాజకీయ లాభాలు చూడరాదు. దేశ సమగ్రతలో రాజీపడరాదు. నేనొక్కడినే కాపాడేది అనడం సరైందికాదని అన్నారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన మోది మరో మోసం. కార్గో రాబడి ఒడిశాకు, పాసింజర్ రాబడి మనకని అయన అన్నారు. ఏపికి రూ.7వేల కోట్ల రాబడి పోగొట్టారు. రిక్రూట్ మెంట్లు మనకన్నా ఒడిశాకే ఎక్కువ. ఎవరిని మోసం చేయాలని ఈ ప్రకటన అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని స్టేషన్లు కూడా మన జోన్ కు ఇవ్వలేదు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన బిజెపి మరో దుర్మార్గం. బిజెపి మోసాన్ని అందరూ ఖండించాలి. శుక్రవారం నల్లజెండాలు, నల్ల బెలూన్లు, నల్లచొక్కాలతో ప్రదర్శనలు జరపాలని అన్నారు. జోన్ ప్రకటనకు వైసిపి, బిజెపి సంబరాలు హాస్యాస్పదం. భార్య బిజెపి, భర్త వైసిపి రెండు పార్టీల లాలూచికి రుజువని అన్నారు. కుటుంబాన్ని బిజెపి, వైసిపి పంచుకున్నాయి. కార్యకర్తలను ఈ రెండు పార్టీలు పంచుకున్నాయి. కుట్రలు-కుతంత్రాలు, దుష్ట బుద్దిని పంచుకున్నాయి. ఏపిలో అడుగుపెట్టే హక్కు మోదికి లేదు. హామీలన్నీ నెరవేర్చాకే మన గడ్డపై అడుగుపెట్టాలని అయన అన్నారు. నిన్న అమరావతిలో జగన్ గృహ ప్రవేశం. మరురోజే హైదరాబాద్ ప్రయాణం. నిలకడగా ఏపిలో నివాసం ఉండడు. జగన్ కు నిలకడ లేదు విశ్వసనీయత లేదని అన్నారు. రాజధాని తరలింపుపై ప్రజల్లో అపోహల సృష్టి. వైసిపి, బిజెపి తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలు. ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెప్పాలి. బిజెపి, వైసిపి నాటకాలను ప్రజలే ఎండగట్టాలని అయన అన్నారు.