Highlights
- డెయిరీ ఉత్పత్తులతో రెట్టింపు ఆదాయం
- జాతీయ మాంస పరిశోధనా కేంద్రం వార్షికోత్సవంలో..
- కేవీఏఎఫ్‌ఎస్ వర్సిటీ డైరెక్టర్ నదీమ్ ఫిరోజ్
- మాంసాహారం తినే వాళ్లలో తెలంగాణదే అగ్రస్థానం
- మాంసాహార ఉత్పత్తులు పెంచాలి: వైద్యనాథన్
పెరుగు, నెయ్యి, పన్నీరు వంటి పాల ఉత్పత్తుల ద్వారా ఆదాయం పెరుగుతుందని, పాడి రైతులు వీటిపై దృష్టి సారించాలని ర్ణాటక వెటర్నరీ, యానిమల్ అండ్ ఫిషరీస్ సైన్సెన్ యూనివర్సిటీ(కేవీఏఎఫ్‌ఎస్) డైరెక్టర్ నదీమ్ ఫిరోజ్ సూచించారు.హైదరాబాద్‌లోని జాతీయ మాంస పరిశోధనా కేంద్రం(ఎన్‌ఆర్‌సీ ఆన్ మీట్) 11వ వార్షికోత్సవానికి ఫిరోజ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శరీరానికి ప్రొటీన్స్ కావాలంటే మాంసాహారం, గుడ్లు, పాలు, చేపలు తినాలన్నారు. గతంతో పొలిస్తే మాంసాహారం తినే వాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.ముఖ్యంగా మాంసాహారం తినే వాళ్లలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు.
దేశంలోనే మాంసాహార జీవజాతులను గుర్తించే ఏకైక సంస్థ తమదేనని ఐసీఏఆర్ - ఎన్‌ఆర్‌సీ ఆన్ మీట్ డైరెక్టర్ వైద్యనాథన్ తెలిపారు. అవసరాలకు తగిన విధంగా మాంసాహార ఉత్పత్తులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
ఆర్గానిక్ మాంసాహారాన్ని ఉత్పత్తి చేసే విధానంపై దాదాపు 250 మంది రైతులకు, 250 మంది మీట్ ప్రాసెసర్స్‌కు శిక్షణ అందించామని తెలిపారు.
డాక్టర్ నవీన మాట్లాడుతూ తెలంగాణలో మటన్ అవసరాలకు ప్రతి ఏడాది దాదాపు 90 లక్షల జీవాలు అవసరం కాగా అందులో కేవలం మూడో వంతు(30 లక్షలు) మాత్రమే రాష్ట్రంలో లభ్యమవుతున్నాయన్నారు. తెలంగాణ లో జీవాల పెంపకాన్ని వాణిజ్యపరంగా చేపట్టడానికి విస్త్రతైమెన అవకాశాలున్నాయని చెప్పారు. ఆ దిశగా రైతులను ఆదిశగా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో డీపీఆర్ డైరెక్టర్ ఛటర్జీ , ప్రిన్సిపల్ సైంటిస్ట్ బర్‌బుద్దే, డాక్టర్ నదీమ్, డా.జార్జ్ నీలన్, డా.రాజేందర్ రెడ్డి, బయెటెక్నాలజీ, వెటర్నరీ విద్యార్థులు పాల్గొన్నారు.