యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
చౌకధరల దుకాణాలు మినీ సూపర్ మార్కెట్లుగా మారాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. భవిష్యత్‌లో ప్రభుత్వం ఉత్పత్తి చేసే వస్తువులను రేషన్ దుకాణాల ద్వారానే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు.రేషన్ డీలర్లను దొంగల్లా చూసే స్థాయి నుంచి దొరల్లా చూసే స్థాయికి తీసుకొచ్చామని చంద్రబాబు అన్నారు. డీలర్ల కమిషన్‌ను 20 పైసల నుంచి రూపాయికి పెంచిన ఘనత తెదేపాదేనని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర రేషన్ డీలర్ల ఆత్మీయ సదస్సులో సీఎం పాల్గొన్నారు. పేదవాళ్లు కూడా బియ్యం తినాలనే ఎన్టీఆర్ కిలో బియ్యం రూ.2లకే ఇచ్చారన్నారు. ఆహారభద్రతకు ఆయనే నాంది పలికారని గుర్తుచేశారు. ఆహారభద్రత కోసం రూ.4వేల కోట్లు కేటాయిస్తున్నామని.. ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి 5 కిలోల చొప్పున బియ్యం అందజేస్తున్నామన్నారు. ప్రజలను రేషన్ డీలర్లు గౌరవంగా పలకరించాలని ఆయన సూచించారు.