Highlights
- ప్రయోగాత్మకంగా 500 కోచ్‌ల్లో ఏర్పాటు
- రైల్వేబోర్డు ఛైర్మన్ అశ్వనీ లోహానీ చొరవ
రైళ్లలోనూ కూడా వ్యాక్యూమ్ టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు రైల్వేబోర్డు నడుంబిగించింది. ఇక నుంచి విమానాల్లో సమకూర్చిన విధంగానే మరుగుదొడ్లు మన రైళ్లల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ సదుపాయాలను ప్రయోగాత్మకంగా 500 కోచ్‌ల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రైళ్లలో వినియోగిస్తున్న జీవ మరుగుదొడ్లకు ఇవి ప్రత్యామ్నాయం కానున్నట్లు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జీవ మరుగుదొడ్లతో దుర్గంధం, మరికొన్ని సమస్యలు ఎదురవుతుండటంతో సాంకేతిక నిపుణుల సూచనల మేరకు మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం విజయవంతమైతే క్రమేపీ అన్ని రైళ్లకూ విస్తరించనున్నారు. అశ్వనీ లోహానీ రైల్వేబోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విమానాల తరహా మరుగుదొడ్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.