YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రెండు, మూడు రోజుల్లో అభినందన్ రిలీజ్

రెండు, మూడు రోజుల్లో అభినందన్ రిలీజ్
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పాక్‌ ఆర్మీ కస్టడీలో ఉన్న భారత వింగ్‌ కమాండర్‌ విక్రమ్‌ అభినందన్‌ విడుదల అంశంపై మరో రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్‌ మహ్మద్‌ ఫైజల్‌ వెల్లడించారు. యుద్ధ ఖైదీ హోదాలో విడుదల చేయాలా? లేదా అన్న కోణంలో ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. తమ ఆధీనంలో ఉన్న అభినందన్‌ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నాడని స్పష్టం చేశారు. సరిహద్దు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో తమ భూభాగంలో అభినందన్‌ అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యాడని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని భావిస్తే అభినందన్‌ను ఇండియాకు అప్పగిస్తామని పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి షా మహముద్‌ ఖురేషి వెల్లడించారు. పైలట్‌ అప్పగింత విషయంలో పాజిటివ్‌ దృక్పథంతోనే ముందుకు వెళ్తున్నామని ఖురేషి అన్నారు. ఒక వేళ భారత ప్రధాని మోదీ చర్చలకు సిద్ధంగా ఉంటే తమ ప్రధాని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌.. నరేంద్రమోదీతో ఫోన్లో మాట్లాడ్డానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. ఇరు దేశాల మధ్య శాంతి, ప్రాంతీయ స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. యుద్ధం జరిగితే పాక్‌కే నష్టం జరుగుతుంది. కానీ భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాదా? అని ఖురేషి ప్రశ్నించారు.

Related Posts