యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
చలికాలం పూర్తి కాకుండానే భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కనిపించాల్సిన పరిస్థితి ఫిబ్రవరిలోనే కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నా యి. మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. తీవ్రమవుతున్న ఎండలకు కారణాన్ని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జె.జగన్నాథం వివరించారు.ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగు తూ వస్తున్నాయన్నా రు. రాత్రి వేళల్లో 14 నుంచి 16 డిగ్రీల వరకునమోదవుతున్నాయన్నారు. పగటిపూట ఉష్ణోగ్రత కంటే రాత్రి పూట ఉష్టోగ్రతలు సగం కంటే ఎక్కువ వ్యత్యా సం ఉందన్నారు. దీనికి ఆకాశంలో మేఘాలు లేకపోవడంతో పాటు పవనాలూ లేకపోవడమేనన్నారు. దీని కారణంగానే పొగమంచు కూడా కురుస్తోందని వివరించారు.వేసవి రాక మునుపే పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు అధికంగా నమోదువుతున్నాయి. తాడిమర్రిలో శుక్రవారం అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో 34 నుంచి 38 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అగళిలో 14.8 డిగ్రీల కనిష్టం ఉండగా.. మిగతా మండలాల్లో 16 నుంచి 22 డిగ్రీల మధ్య కొనసాగింది. గాలిలో తేమశాతం ఉదయం 72 నుంచి 78, మధ్యాహ్నం 22 నుంచి 34 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది వేసవితాపం తారస్థాయిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.వేసవి పూర్తిగా రాకముందే భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచి ప్రతాపాన్ని చూపిస్తుండడంతో జనం ఆందో ళన చెందుతున్నారు. మంచు ప్రభావం మామిడి, జీడిమామిడి పూతపై ఉంటుందన్నా రు. ఈ పరిస్థితిలో యాజమాన్యం పద్ధతుల్లో మంచు నుంచి సోకుతున్న వ్యాధులకు తగిన మందులు వినియోగించాలని రైతులకు సూచిం చారు. పొడి వాతావరణ తేమగా ఉందని.. ఉద యం 6 గంటల సమయంలో 87 శాతం ఉన్నటు వంటి తేమ సాయంత్రమయ్యేసరికి 23 శాతానికి చేరుకుంటోందన్నారు. దీనికి సముద్రం వైపు నుంచి గాలులు వీయకుండా భూభాగం నుంచి మాత్రమే గాలులు వీయడమేనన్నారు. అతి నీలలోహిత కిరణాల ప్రభావం వాస్తవంగా ఆరు నుంచి ఏడు పాయింట్లు ఉండాల్సి ఉండగా ప్రస్తు తం పది పాయింట్ల వరకు ఉంటోందని.. దీంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రస్తుతం కాస్తున్న ఎండలో తిరిగే వారికి చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇదే వాతావరణం మరికొద్ది రోజులు ఉంటుందన్నారు