YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాశ్మీరు ఎవరిది ?

కాశ్మీరు ఎవరిది ?

యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:

స్పెషల్ రిపోర్ట్:

ఇది, కశ్యప మహర్షి పేరుతో ఏర్పడిన ప్రదేశము
" మైరా " అనే సంస్కృత పదానికి అర్థము " సరోవరము " అని.
ఈ మన్వంతరములోని సప్త ఋషులలో ఒక్కరు కశ్యపుడు. ఇతడు బ్రహ్మ దేవుని మనవడు. ఇతడి తండ్రి మరీచి మహర్షి. ఈ మరీచి, బ్రహ్మ దేవుని మానస పుత్రుడు. దక్ష ప్రజాపతి తన పదముగ్గురు కుమార్తెలనూ కశ్యప మునికి ఇచ్చి వివాహము చేస్తాడు.
కశ్యప గోత్రము ఆరంభమయ్యేదే ఇక్కడినుండీ. వీరి సంతానములో , దేవతలు, దైత్యులు, దానవులు, నాగులు, మానవులు-మొదలుగా సర్వజీవులూ చేరి ఉన్నారు.
నీలమత పురాణము ప్రకారము, ఇప్పటి కాశ్మీర్ ఉన్న ప్రదేశములో ’ సతీసరము ’ అనే అతిపెద్ద సరోవరము ఉండినదంట. శివుడు, సతీదేవి--ఇద్దరికీ అది చాలా ఇష్టమైన సరోవరము అయినందువల్ల కశ్యపుడు ఈ సరోవరాన్ని వారికి బహుమానముగా ఇచ్చినాడు.
అయితే ఆ సరోవరములో ’ జలోద్భవుడు ’ అనే రాక్షసుడు దాగిఉండి, కశ్యపుడి సంతానానికి వేధింపులు చేసేవాడు. అప్పుడు , కశ్యపుడు, తన కొడుకైన ’ అనంత నాగుడి’ తో కలసి, ఒక వరాహ ముఖము [ ఇప్పటి బారాముల్లా] అనబడు కాలువను తవ్వి, ఆ సరోవరపు నీటిని బయటికి ప్రవహింపజేస్తాడు. ఈ విధముగా  ప్రవహించిన నీరు పశ్చిమములోనున్న మరొక కాలువ కు చేరుతుంది. దానిని కశ్యప సాగరము [ ఈనాటి కాస్పియన్ సముద్రము] అని పిలుస్తారు.

ఆ తరువాత సరోవరమునుండీ బయట పడిన జలోద్భవుడిని విష్ణువు సంహరిస్తాడు.
ఇలాగ  నిండుకున్న సరోవరపు ప్రక్కన ’ వేద వ్యాసంగముల కోసము’ విశేషముగా ఒక పవిత్ర క్షేత్రాన్ని నిర్మిస్తారు. దానిని " కశ్యప మైరా " అని పిలిచేవారు . అదే కాలక్రమేణా ’ కశ్య మైరా’ అనీ, " కశ్మీర " అనీ నామాంతరము చెందింది.

ఈ సుందర కాశ్మీరమును చూచుటకు గౌరీ దేవి, గణపతి తో పాటు హిమాఛ్చాదితమైన ఒక పర్వత మార్గము ద్వారా తరచు వచ్చేది. దానిని " గౌరీ మార్గ " అని పిలిచేవారు. అదే నేటి గుల్మార్గ్ .

’ నీలమతి పురాణము ’ మరియూ దాని ఆధారముగా లిఖింపబడిన " రాజతరంగిణి" --ఇవి, కాశ్మీరపు పౌరాణిక మరియూ ఐతిహాసిక దాఖలాలు.
పన్నెండవ శతాబ్దములో " కల్హణుడు " అనే పండితుడు వ్రాసిన గ్రంధాల శృంఖల , విశ్వములోని అన్ని చోట్లా అత్యంత కుతూహలముతోను, శ్రద్ధాభక్తులతోను అభ్యసించబడుతున్నాయి.
భారత్ లో దీని గురించి ఎవరూ ఎక్కువగా పట్టించుకొనుట లేదు. ఎందుకంటే , మాధ్యమాలు ప్రతిబింబించే కాశ్మీరు పూర్తిగా వేరే. కాశ్మీరు హిందువులది అంటే నమ్మే పరిస్థితి నేడు హిందువులలోనే లేదు. దురదృష్టము...

ఇది ఎవరి కాశ్మీరము ?

ఇది శారదాదేవి యొక్క కాశ్మీరము.
|| నమస్తే శారదా దేవి కాశ్మీర పురవాసిని|
త్వామహం ప్రార్థయే నిత్యం  విద్యాదానం చ దేహి మే ||
ఇలాగ శారదా దేవిని స్తుతి చేసేది ’ కాశ్మీర పురవాసిని’ అనే!.
కాశ్మీరపు లిపి ఏమిటో తెలుసా ? అది ’ శారదా లిపి ’
అప్పటి కాశ్మీర వేద విద్యాలయాలను ఏమని పిలిచేవారు ? ...." శారదా పీఠము "
ఇదంతా ఎందుకు ,? ఆనాడు పూర్తి కాశ్మీరాన్నే " శారదా దేశము " అని పిలిచేవారు.
కాకపోతే, శంకరాచార్యులు కాశ్మీరానికి ఎందుకు వెళ్ళేవారు ....?
అక్కడి కృష్ణగంగా నది యొక్క తీరములోనున్న శారదాపీఠపు సొగసును చూసి, అదే పద్దతిలో దానిని ప్రతిబింబించేలాగ ఇంకొక శారదా పీఠాన్ని తుంగభద్రా తీరపు శృంగేరి లో స్థాపించుటకు ప్రేరణ దొరికినది ఆ కాశ్మీర శారదాపీఠము వల్లనే!
శారదాదేవి యొక్క శ్రీగంధపు మూల విగ్రహాన్ని కాశ్మీరు నుండే శృంగేరికి తరలించినారట.
కాశ్మీరానికి తమ కొందరు శిష్యులతోపాటు వెళ్ళిన కొత్తలో శంకరాచార్యులు, ఒక కాశ్మీరీ పండితుడి అతిథిగా ఉన్నారు. మొదటి దినమే శంకరాచార్యుల పాండిత్యానికి విస్మయము చెందిన ఆ పండిత దంపతులు, వారిని మరికొంతకాలము తమ అతిథిగా ఉండి సత్కారాలను స్వీకరించమని మనవి చేసుకున్నారట.
దానికి ఒప్పుకున్న శంకరాచార్యులు, ఒక నిబంధన పెడతారు. ఏమనగా, ’ నా వంట నేనే చేసుకుంటాను ’ అని. ఇది ఆ పండిత దంపతులకు కొంత అవమానకరముగా తోచిననూ, వారిష్ట ప్రకారమే  , కావలసిన సంభారములనూ, వంటపాత్రలు, వంట చెరకు లను ఇచ్చి విరమిస్తారు.
అయితే వంట చేయుటకు కావలసిన అగ్నిని ఇవ్వడము మరచిపోతారు.
మరొకసారి ఆ దంపతులను పిలచి ఇబ్బంది పెట్టరాదని తలచి శంకరాచార్యులు, అలాగే ఆకలితో నకనకలాడుతూనే పడుకుని నిద్రిస్తారు. మరునాడు ఆ పండిత దంపతులు వచ్చి నమస్కరించి  మాట్లాడిస్తుండగా,  వంట సామగ్రి అంతా అలాగే పడి ఉండుట గమనించి, ’ఎందుకని’ విచారించగా, వారి శిష్యులు, అగ్ని లేని కారణాన శంకరాచార్యులు వంట చేసుకోలేదు-అని సమాధానమునిస్తారు.
తక్షణమే ఆ గృహిణి, అక్కడే ఉన్న నీటిని ఆ కట్టెలమీద చిలకరించగానే ఆ కట్టెలు అంటుకొని మండనారంభిస్తాయి.
ఈ ప్రహసనము వల్ల, శంకరాచార్యులకు, తాము ఇంకా చాలా నేర్చుకోవలసినది ఈ శారదా దేశములో ఉంది--అనిపించి, ఇంకొన్ని దినాలు అక్కడే నివశిస్తారు. వారు నిలచిన ఆ ప్రదేశము--ఒక గుట్ట -ను ఈనాటికీ శంకరాచార్య గుట్ట అనె పిలుస్తారు. ఆ పేరుతోనే అది ప్రసిద్ధమైనది. అదొక పుణ్యక్షేత్రము అనిపించుకున్నది. ఇది శ్రీనగరపు నట్ట నడుమ ప్రసిద్ధమైన ’ దాల్ ’ సరోవరపు ప్రక్కనే ఉంది. ఆనాటి శారదాపీఠము , దురదృష్టవశాత్తూ ఇప్పటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉంది. అక్కడికి వెళ్ళుటకు ఎవరికీ అనుమతి లేదు.[ ఈ శారదాపీఠపు శిథిల చిత్రాలు ఈ మధ్యనే ఎవరో పోస్ట్ చేశారు.. ఉన్నవారు పంచుకోగలరు ]  ఆ శారదా పీఠము శిథిలమై, దినదినానికీ కుంగిపోవుతున్నది.
" విశిష్టాద్వైతము " అనే సిద్ధాంతము, " నాథ ముని " ద్వారా ప్రారంభమైనది అని ఉల్లేఖనములు ఉన్నాయి. దానిని యమునాచార్యులు విస్తరించినారు. మరియూ రామానుజాచార్యులు బ్రహ్మసూత్రపు చౌకట్టులో ప్రతిపాదించి, " శ్రీ భాష్యము " అనె మేరుగ్రంధాన్ని సృష్టించినారు. ఇదే, శ్రీవైష్ణవుల మూలగ్రంధము. ఇటువంటి మహద్గ్రంధాన్ని సృష్టించుటకే రామానుజులు తమ శిష్యుడైన ’ కురుత్తాళ్వార్ ’ [ ఖురేషీ ] తో కలసి బ్రహ్మసూత్రాన్ని వెదకుతూ కాశ్మీరానికి వెళ్ళినారు. వారికి అప్పటికే అరవై యేళ్ళు!

Related Posts