Highlights
- మాటల్లో చిక్కుకున్న పదిమంది కార్మికులు
- భయాందోళనలో స్థానికులు
హైదరాబాద్ లోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు కెమికల్ కంపెనీల్లో మొదలైన మంటలు ఎగిసిపడుతూ పక్కనే ఉన్న గోదాములోకి వ్యాపించాయి. అయితే ప్రమాదం జరిగే సమయంలో పదిమంది కార్మికులు లోపల చిక్కుకోగా.. వారిలో నలుగురిని స్థానికులు కాపాడారు. మరో ఆరుమంది లోపలే చిక్కుకోగా.. వారిని బయటకు తెచ్చేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ అగ్ని ప్రమాదంలో కిలోమీటర్ దూరం వరకు పొగ వ్యాపిస్తుండగా.. స్థానికులు భయాందోళనలో ఉన్నారు.సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు వచ్చి మంటలను అదుపుచేస్తున్నారు.