Highlights
- ఆమె ఆరోగ్యంపై సీఎం ఆరా
- శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ చేసే అవకాశం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు సతీమణి శోభ గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, ఇతర సమస్యలతో బాధపడుతున్న ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన డాక్టర్లు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. శుక్రవారం ఆమెను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె అనారోగ్యం గురించి తెలుసుకున్న కేసీఆర్ గురువారం ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు.