YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఉగ్రవాదుల కేసులను పరిష్కారించడం లో ఎన్ఐఏ కీలక పాత్ర - కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్

ఉగ్రవాదుల కేసులను పరిష్కారించడం లో ఎన్ఐఏ కీలక పాత్ర  - కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

ఉగ్రవాదుల కేసులను పరిష్కారించడం లో ఎన్ఐఏ కీలక పాత్ర పోషించందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం నాడు మాదపూర్లో ఎన్ఐఏ కార్యాలయం తో పాటు అధికారుల గృహసముదాయాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పుల్వామా దాడి అత్యంత దారుణమన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలన్నారు. పుల్వామా ఘటన బాధ యావత్ దేశానిదన్నారు. ప్రపంచ దేశాలన్ని భారత్ కు మద్దతుగా నిలిచాయన్నారు. ప్రపంచ దేశాలన్ని ఏకతాటి పైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కు అండగా నిలుస్తున్నాయన్నారు.  ఉగ్ర కేసులను దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ సేవలు దేశానికి ఎంతో అవసరమని అయన అన్నారు. ఎన్ ఐఏ దర్యాప్తు చేసిన 92 కేసుల్లో ఉగ్రవాదులకు శిక్ష పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయాలని అన్నారు. ఐసిస్, ఐఎస్ఐ పై  రీసెర్చ్ సెల్ ఏర్పాటు చేయాలని అభిప్రాయడపడ్డారు.

Related Posts