యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రైల్వే జోను ఇచ్చినట్లే ఇచ్చి రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే వైఖరి, ఇదీ ఒక కుట్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఎంతమాత్రం ప్రయోజనకరం కాని రీతిలో విశాఖకు రైల్వే జోన్ ఇచ్చారని అన్నారు. ప్రధాని మోడీ విశాఖ రాకకు నిరసనగా అయన శుక్రవారం నల్ల చొక్కా ధరించి ఉండవల్లి ప్రజావేదికకు వచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర సహాయ నిరాకరణ వైఖరికి నిరసన తెలిపారు. ఐదు కోట్ల ప్రజల హక్కుల సాధనకు, ప్రధాని మోడీ మొండి వైఖరికి చంద్రబాబు నిరసన తెలిపారు.