YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికల వేళ పోటీకి దూరంగా నటుడు మురళీమోహన్?

 ఎన్నికల వేళ పోటీకి దూరంగా నటుడు మురళీమోహన్?
తొలి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ సమయానికి అనుకూలంగా వ్యవహరించే ప్రస్తుతం రాజమహేంద్రవరం ఎంపీగ ప్రముఖ నటుడు మురళి మొహన్ కు సంబంధించి ఆసక్తికర  వార్త ఒకటి వైరల్ అవుతోంది. త్వరలో జరిగే ఎన్నికల బరిలో ఆయన ఉండరన్న మాట చెబుతున్నారు.ఈ విషయాన్ని ఇప్పటికే అధినాయకత్వానికి చెప్పేసినట్లుగా తెలుస్తోంది. మిగిలిన నేతలంతా తమకంటే తమకు కావాలంటూ టికెట్ల కోసం పైరవీలు చేసే పరిస్థితి ఉంటే.. అందుకు భిన్నంగా మురళీ మోహన్ పోటీ నుంచి తప్పుకోవాలనుకోవటం చిన్న విషయం కాదని చెబుతున్నారు. మొన్నటి వరకూ ఆయన.. ఆయన కోడలు రూప కూడా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది.ఇందుకు భిన్నంగా ఇప్పుడు మాత్రం మామ.. కోడళ్లు ఇద్దరూ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకోవటం ఆసక్తికరంగా మారింది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఏపీలో బాబుకు వ్యతిరేక గాలి వీస్తుండటంతో అనవసరమైన రాజకీయ అఫిలియేషన్ కు దూరంగా ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీ రాజధాని అమరావతి చుట్టుపక్కలా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు ఆయన కుటుంబానికి.. సన్నిహితులకు ఉన్నాయని.. ఇలాంటివేళ రాజకీయ వైరానికి దూరంగా.. బిజినెస్ పెద్ద మనిషిగా మారాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే కీలకమైన ఎన్నికల వేళ పోటీకి దూరంగా ఉండటం ద్వారా.. తనకు టీడీపీకి మధ్య సంబంధం లేదన్న సంకేతాల్ని పంపినట్లు అవుతుందన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తెలివైన వ్యాపారి ఎప్పుడూ రాజకీయ విరోధుల్ని పెంచుకోరు. ఆ విషయాన్ని మురళీమోహన్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.. అదే వ్యూహాన్ని ఇప్పుడు ఆయన అమలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. టాలీవుడ్లో ఎంతమంది నటీనటులున్నా సీనియర్ నటుడు మురళీమోహన్ కున్నంత తెలివి మరెవరికీ లేదంటారు. సినిమాల్లో ఉంటూనే వ్యాపారానికి అవసరమైన సరంజామా అంతటిని సిద్ధం చేసుకోవటమేకాదు.. ఊహించని రీతిలో ఆర్థికంగా బలోపేతం కావటం ఆయనకు మాత్రమే చెల్లిందని చెబుతారు. వివాదాస్పద వ్యాఖ్యలు ఎప్పుడూ మాట్లాడకుండా తన పని తాను చూసుకున్నట్లుగా వ్యవహరించే మురళీమోహన్ మిగిలిన రాజకీయ నేతలకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారని చెబుతారు. రాజకీయంగా కంటే సినీ ప్రముఖుడిగా చెలామణి అయ్యే ఆయన.. ఈ రెండు పాత్రల కంటే కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయనకు మించినోళ్లు టాలీవుడ్ లో లేరని చెబుతారు.మరి.. పోటీకి దూరంగా ఉండాలన్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే.. ఈ విషయంపైనా మురళీమోహన్ అధికారికంగా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు సుమా.

Related Posts