Highlights
- బయో ఏషియా-2018 సదస్సును ప్రారంభించిన కేటీఆర్
- వ్యాక్సిన్లకి హైదరాబాద్ అగ్రస్థానం
ఫార్మా కంపెనీల నుంచి ప్రతి ఏటా ఒక కొత్త వ్యాక్సిన్ మార్కెట్‌లోకి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో మూడు రోజుల పాటు జరిగే బయో ఏషియా-2018 సదస్సును కేటీఆర్ ప్రారంభించారు. ఈ సదస్సుకు యాభై దేశాల నుంచి 1200 మందికిపైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న ఆధునిక పరిశోధనలపై చర్చిస్తున్నారు. ప్రపంచానికి చౌకైన వ్యాక్సిన్లు అందించడంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చెప్పారు.