YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కదిరి లో టీడీపీకి షాక్

 కదిరి లో టీడీపీకి షాక్
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలుగుదేశం పార్టీకి చెందిన కదిరి మండలం పట్నం మాజీ సర్పంచ్ మహేష్, ఆ పార్టీకే చెందిన బూరుగుపల్లి మరో మాజీ సర్పంచ్ ఆంజనేయులు శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఆ పార్టీ  కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి, ఆ పార్టీ సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డిలు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబునాయుడు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి ఊబిలో కూరుకుపోయిందని, అందుకే ప్రజల అభిప్రాయం మేరకు మేము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు ఈ సందర్భంగా ప్రకటించారు. జగనన్న ముఖ్యమంత్రి కావడం కోసం మా వంతు పాత్ర పోషిస్తామన్నారు. పార్టీలో చేరిన వీరిరువురికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని డాక్టర్ సిద్ధారెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరిన్ని వలసలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ప్రకాష్, మాజీ సర్పంచ్ లు సుధీర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి లు పాల్గొన్నారు.

Related Posts