యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
లోక్ సభ ఎన్నికలు మే నెలలోనే జరిగి తీరుతాయని, అనుకున్న సమయం ప్రకారమే జరిగి తీరుతాయని, అందులో ఎలాంటి మార్పూ ఉండబోదని భారత ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరా స్పష్టంచేశారు. భారత్, పాక్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో వాటి ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందా? అన్న ప్రశ్నకు అరోరా పై విధంగా స్పందించారు. ఇప్పటి వరకైతే ఎన్నికల తేదీలను ఖరారు చేయలేదు కానీ, షెడ్యూల్డ్ ప్రకారమే జరుగుతాయని, అందులో ఎలాంటి మార్పూ లేదని తేల్చి చెప్పారు. కొత్త నిబంధనల ప్రకారం ఆయా పార్టీల అభ్యర్థుల తమ ఆస్తుల వివరాలను తెలపాలని, ఈ వ్యహారాన్ని ఐటీ విభాగం చూసుకుంటుందని, ఒకవేళ ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే వెంటనే ఈసీ దృష్టికి తీసుకురావాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అరోరా హెచ్చరించారు.