యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
కల్యాణ్ రామ్ తన తదుపరి సినిమా కోసం ఓ యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. 'ఉయ్యాలా జంపాలా' .. 'మజ్ను' చిత్రాల దర్శకుడు విరించి వర్మ. ఈ రెండు సినిమాలు కూడా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.ఇటీవలే ఈ దర్శకుడు కల్యాణ్ రామ్ కి ఒక కథ వినిపించాడట. కథలోని కొత్తదనం కారణంగా .. విరించి వర్మకి ఓకే చెప్పేశాడని సమాచారం. ప్రస్తుతం విరించి వర్మ ఈ స్క్రిప్ట్ పైనే కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. పల్లెటూరి నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు.