యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
'అఖిల్' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన కథానాయిక సాయేశా సైగల్ తమిళ నటుడు ఆర్యను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. ఈ నెల రెండో వారంలో హైదరాబాదులో వీరి వివాహ వేడుక జరుగుతుంది. కాగా, వివాహమయ్యాక కూడా నటన కొనసాగిస్తానని, సినిమాలకు స్వస్తి చెప్పే ఉద్దేశం లేదని సాయేశా తాజాగా చెప్పింది.