YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సేఫ్ ప్లేస్ కోసం లోకేష్ ప్రయత్నాలు

సేఫ్ ప్లేస్ కోసం లోకేష్ ప్రయత్నాలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ ప్రత్యక్ష్య ఎన్నికల బరిలోకి దిగుతారా? ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఏ నియోజకవర్గమయితే అనుకూలంగా ఉంటుంది? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న ప్రశ్నలే. ఇప్పటి వరకూ లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టారు. దీనిపై విపక్షాల నుంచి లోకేష్ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవగల సత్తా లోకేష్ కు లేదని విమర్శిస్తున్నా ఇప్పటి వరకూ లోకేష్ మౌనంగానే ఉన్నారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో లోకేష్ పోటీ చేయనున్నారన్న ప్రచారం జరుగుతోంది. తొలుత లోకేష్ తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. చంద్రబాబు ఉత్తరాంధ్రలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పార్టీలో కూడా పెద్దయెత్తున చర్చ జరిగింది. అయితే కుప్పం నుంచే తిరిగి చంద్రబాబు పోటీ చేస్తారని ఖరారు అయింది. ఇక కృష్ణా జిల్లాలో బలంగా ఉన్న పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే పెనమలూరుకు సిట్టింగ్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ను చంద్రబాబు టిక్కెట్ ఇచ్చేశారు. లోకేష్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. తాజాగా విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావును విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గానికి పంపి లోకేష్ భీమిలీ నుంచి బరిలోకి దిగుతారన్న టాక్ నడుస్తోంది. అయితే భీమిలీ అంత సేఫ్ సీట్ కాదన్నది విశ్లేషకుల అంచనా. ఎందుకంటే భీమిలీ నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాలు సాధించినప్పటికీ 2004, 2009 ఎన్నికలలో టీడీపీ ఓటమి పాలయింది. 2004లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కర్రి సీతారాం విజయం సాధించగా, 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ముత్తంశెట్టి శ్రీనివాస్ గెలుపొందారు.వైసీపీ తరుపున ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇక్కడ పోటీ చేస్తున్నారు. సామాజిక సమీకరణాలను బట్టి చూసుకున్నా భీమిలీ అంత సేఫ్ కాదన్నది టీడీపీ వర్గాలు సయితం అంగీకరిస్తున్నాయి. అయితే లోకేష్ మాత్రం గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పెదకూరపాడులో 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుకుంది. ఇక్కడి నుంచి కొమ్మాల పాటి శ్రీధర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. లోకేష్ two నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని సమాచారం. పెదకూరపాడు అయితే రాజధానికి దగ్గరగా ఉండటం, నియోజకవర్గంలో తరచూ పర్యటనలు చేయడానికి ఉపయోగపడుతుందని లోకేష్ భావిస్తున్నారు. మొత్తం మీద లోకేష్ ఇంతకూ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతారా? లేదా? అన్నది స్పష్టత లేకపోయినప్పటికీ అనేక నియోజకవర్గాలను మాత్రం లోకేష్ ఖాతాలో వేస్తున్నారు.

Related Posts