YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పవన్ వింతగా మాట్లాడుతున్నారు

పవన్ వింతగా మాట్లాడుతున్నారు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఒక్క దాడితో పెద్ద ఎత్తున ఉగ్రవాదులను మట్టుపెట్టడం  ప్రపంచ చరిత్రలో తొలిసారి. మనంచేసిన ఎదురు దాడి వల్లే పాకిస్తాన్ తోక ముడిచింది. అభినందన్ ధైర్య సాహసాలతో పాటు, మోడి దౌత్యం కూడా బాగా పని చేసింది. దేశ ప్రజలంతా మోడి, అభినందన్ ను ముక్త కంఠంతో అభినందిస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. పుల్వామా దాడిని పాకిస్తాన్ అంగీకరిస్తే,  ఇక్కడ కొంతమంది నేతలు బిజెపి ని తప్పుపడుతున్నారు. దురదృష్టవశాత్తు కొంతమంది పాకిస్తాన్ లో హీరో లు కావాలనే తాపత్రయం తో మోడి పై నిందలు మోపుతున్నారు. చంద్రబాబు, మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల పై ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అయన అన్నారు. 
యూటర్న్ బాబు గా పేరు పొందిన బాబు మళ్లీ మాట మార్చారు. పవన్ కూడా ఈ మధ్య వింతగా మాట్లాడుతున్నారు. 
పికె అంటే పాకిస్తాన్ లో షార్ట్ కట్.  అందుకే వారు హీరో అనుకుంటున్నారు. చంద్రబాబు ప్రభావం పవన్ పై పని చేశాయనే అనుమానం కలుగుతుంది. ఒకప్పుడు చినబాబు, పెదబాబు లను విమర్శించిన పవన్ ఇప్పుడు వారిని ఏమో అనడం లేదని విమర్శించారు. చిన్నహీరో శివాజీ స్థాయి సరిపోవడం లేదని, పెద్ద హీరో పవన్ తో చంద్రబాబు మాట్లాడించారేమో. ఎవరో చెప్పారంటున్న పవన్... వారి వివరాలు వెల్లడించాలి. పవన్ వాడిన మాటలను పాకిస్థాన్ ప్రధానంగా వాడుకుంటున్నాయి. ఓట్ల కోసం జాతీయ భద్రత అంశాలను వాడుకోవద్దని అయన అన్నారు. ఇప్పటికైనా ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు పవన్ ప్రకటించాలి. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిస్తే పవన్ కు ప్రజాదరణ ఉంటుంది. రైల్వే జోన్ అంశంలో మోడికి పేరు వస్తుందనే అక్కసుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. అనేక కేంద్ర పధకాలకు స్టిక్కర్ వేసుకున్న బాబుకు.. ఈ రైల్వే జోన్ కు వేసుకునే అవకాశం లేకుండా పోయింది. కేంద్రం విడుదల చేసిన నిధుల వివరాలు ఎందుకు చెప్పడం లేదు. నిన్న మోడి నే స్వయంగా బాబు బండారాన్ని ప్రజలకు వివరించారు. పటిష్ఠమైన నాయకుడు ఉంటేనే దేశ భద్రత కు భరోసా ఉంటుందని జీవీఎల్ అన్నారు.

Related Posts