యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీకి ప్రత్యేక హోదా ఎవరైతే ప్రకటిస్తారో వారికే మా మద్దతు అని వైకాపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసారు. అన్నివనరులు పుష్కలంగా ఉన్న ఏపీకీ ప్రత్యేక హోదా ఎందుకు? అన్న టీవీ ప్రతినిధి ప్రశ్నకు జగన్ దీటుగా సమాధానమిచ్చారు. ప్రత్యేక హోదా ప్రజలు అడిగింది కాదని, ప్రజల సంక్షేమాన్ని కోరుతూ మేమే ఇస్తామని కాంగ్రెస్, బీజేపీలు ఇచ్చిన హామీ అని గుర్తు చేశారు. ఆ హామీని విస్మరించి కాలయాపన చేస్తుంటే ప్రజలకు పార్లమెంటుపై విశ్వాసం పోతుందన్నారు. శనివారం ఇండియా టుడే సంస్థ నిర్వహించిని ‘కాంక్లేవ్ 2019’లో జగన్ మాట్లాడారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు దీటుగా ఏపీ అభివృద్ధి చెందాలంటే అది ప్రత్యేక హోదాతోనే సాధ్యమని చెప్పారు. పన్ను మినహాయింపు, పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, అందుకే హోదా గురించి డిమాంగ్ చేస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తామని అయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్లో చాలా వరకు కొందరు వ్యక్తులు సృష్టించినవే అని పేర్కొన్నారు. ఓ వర్గం వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయోజనం కల్పించారని విమర్శించారు. ఇప్పుడు ఏపీలో విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య ఎన్నికలు. మా నాన్న చనిపోయిన తరువాత ఓదార్పు యాత్ర చేస్తానని ప్రకటించగానే కేసులు పెట్టారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి నా మీద తప్పుడు కేసులు పెట్టించారని అయన ఆరోపించారు.