మాదిగ వర్గానికి చెందిన జన్ని రమణయ్య ను గూడూరు సీటుకు సిఫార్సు చేసేందుకు నేను ,మంత్రి సోమిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి కృషి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో శనివారం జెన్నీ రమణయ్య బద్దెపూడి రవీంద్ర కే ఎలీషా కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది మంత్రి నారాయణ మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి లను కలిశారు ఆ మేరకు ఒక వినతిపత్రాన్ని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డికి అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంతకు ముందే ఈ నాయకులు తనను కలిశారని ,మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిని ,మంత్రి సోమిరెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు బీద రవిచంద్ర లను కలవమని చెప్పానని, తాను కూడా వారితో కలిసి గట్టిగా సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో కూడా ఈ మేరకు ప్రతిపాదన రెండు నెలల క్రితమే వచ్చిందని, తాను సీఎం దృష్టికి తీసుకు వెళ్లా నని చెప్పారు గతంలో పాట్ ర ప్రకాష్ రావు గూడూరు నుంచి మూడుసార్లు ఎన్నికయి ఉత్తమ పాలనను నిజాయితీతో కూడిన ప్రాతినిధ్యాన్ని చూపించారని తెలిపారు .మాదిగ నేతల కోరిక సముచితమైనదే నని దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు తప్పకుండా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ అబ్దుల్ అజీజ్ ,జెన్నీ రమణయ్య బద్దెపూడి రవీంద్ర,ఎలీషా కుమార్ ఆనం జయకుమార్ రెడ్డి రంగారెడ్డి ఖాజవలి కమలాకర్ రెడ్డి కార్పొరేటర్లు రాజేష్ స్వర్ణ వెంకయ్య పద్మ మల్లికార్జున్ రెడ్డి సుధాకర్ యాదవ్ బండి రమేష్ వెంకయ్య నరసింహ రావు పద్మజా యాదవ్ షాలిని విజయ తదితరులు పాల్గొన్నారు.