కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై భివాండీ కోర్టు ఆరోపణలను నమోదు చేయబోతోంది. ‘‘ఆరెస్సెస్ వ్యక్తులు గాంధీజీని హత్య చేశారు’’ అని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసులో ఆరోపణలను నమోదు చేసేందుకు ఏప్రిల్ 23న హాజరుకావాలని కోర్టు ఆయనను ఆదేశించింది.
రాహుల్ గాంధీ బుధవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కానీ ఆయన తరపు న్యాయవాది మినహాయింపు కోరుతూ దరఖాస్తు సమర్పించారు. ఆయన విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది.
2014 మార్చిలో థానేలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘‘ఆరెస్సెస్ వ్యక్తులు గాంధీజీని హత్య చేశారు, నేడు ఆ వ్యక్తులు (బీజేపీ) ఆయన గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు సర్దార్ పటేల్‌ను, గాంధీజీని వ్యతిరేకించారు’’ అని ఆరోపించారు.