ఈ నెల ఆరవ తేదీనుంచి ఎంసెట్ పరీక్షకు ఆన్ లైన్ దరఖాస్తలు స్వీకరిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మెన్ టి.పాపిరెడ్డి వెల్లడించారు. శనివారం కూకట్ పల్లిలోని ,జేఎన్టీయూ లో అయన ఎంసెట్ షెడ్యూల్ విడుదల చేసారు. ఎలాంటి లేట్ ఫీజ్ లేకుండా ఎప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 6 నుండి 9వ తేదీ వరకు దరఖాస్తులలో సవరణ చేసుకోవచ్చని అయన అన్నారు. రూ 500 రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వేయి రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 18న హాల్ టికెట్ల జనరేషన్ వుంటుంది. ఏప్రిల్ 20 నుండి మే 1వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఐదువేల రూపాయలతో ఏప్రిల్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదివేల రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ పరీక్ష మే 3,4,6వ తేదీలలో నిర్వహిస్తారు. అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు మే 8,9లలో పరీక్ష వుంటుందని అయన అన్నారు.