జనసేన పార్టీలో చేరితే తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకున్న నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తామని పవన్ కల్యాణ్, కాకినాడ ఎంపీ తోట నరసింహంకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. శనివారం నాడు కిర్లంపూడి మండలంలోని వీరవరం గ్రామానికి వచ్చిన పవన్ కల్యాణ్ రాయబారులు ఈ మేరకు నరసింహం కుటుంబ సభ్యులకు అధినేత మనసులో ఉన్న ఆలోచనను తెలియజేశారు.