YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నూజివీడు సీటుపై పీఠముడి

నూజివీడు సీటుపై పీఠముడి

నూజివీడు తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పనితీరు 86.5 శాతంతో జిల్లాలోనే సంతృప్తి కరంగా ఉందని  సమీక్షా సమావేశ సభావేదికపైనే జిల్లా నాయకులు ప్రకటించారు. అయినా ఇక్కడి స్థానిక నాయకత్వంపై పలువురు నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ స్థానిక నాయకులు ఎందుకు ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పేరును అభ్యర్థిగా అంగీకరిస్తూ మద్దతు తెలుపలేకపోయారు?, బహిరంగ వేదికపై ‘చంద్రబాబు టికెట్‌ ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం..’ అని చెప్పిన నాయకులు, విడివిడిగా ముద్దరబోయినపై ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ గైడ్‌లైన్స్‌ ప్రకారం.. ఈ నియోజకవర్గంలో పార్టీ పనితీరు సంతృప్తికరంగా ఉండగా, దానికి విరుద్ధంగా స్థానిక నాయకులు నూజివీడు ఇన్‌చార్జిపై సంపూర్ణ మద్దతు తెలపకపోవడంతో, రాష్ట్ర, జిల్లా నాయకులకు తలనొప్పిగా మారింది.జిల్లా ఇన్‌చార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు తప్ప జిల్లా మంత్రులెవరూ మొదటి నుంచి నూజివీడు టీడీపీ వర్గ వివాదంలో తలదూర్చలేదు. సామాజిక రిజర్వేషన్‌తో నూజివీడు టికెట్‌ ముడిపడి ఉండటంతో అభ్యర్థి ఎంపికపై చంద్రబాబు ఆచీతూచీ నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టికెట్‌లు ఖరారయ్యాక చివరిగా నూజివీడు టికెట్‌ విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదిష్టానం ఆదేశిస్తే నూజివీడు, గుడివాడ నుంచి పార్టీ తరఫున తాను పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు చేసిన ప్రకటనపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిని నిర్వహిస్తున్న బచ్చుల అర్జునుడు, పార్టీ ముఖ్య నేతలతో చర్చించకుండా ఇలాంటి ముఖ్య ప్రకటనలు చేయరు. దీంతో నూజివీడు విషయంలో పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందని స్థానిక టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పట్ల నియోజకవర్గంలోనే పలువురు నాయకులు సంతృప్తికరంగా లేరని స్పష్టమైన ఈ దశలో వారి మధ్య సయోధ్య కుదర్చకుండా టికెట్‌ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడదామంటూ ముద్దరబోయిన భుజం తట్టి రాత్రి 2 గంటలకు పంపినట్లు సమాచారం. దీంతో నూజివీడు టీడీపీ సీటు చివరి నిమిషంలో పీఠముడి పడినట్లు అయింది. గతంలోలా నూజివీడు టికెట్‌ చివరి నిమిషంలోనే తేలుతుందనే అభిప్రాయం నియోజకవర్గంలో సర్వత్రా వ్యక్తమవుతోంది. స్థానిక టీడీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని ఓ కీలక నేత, మాజీ మంత్రిమరో వారం రోజుల్లో టీడీపీ తీర్థం తీసుకుని, నూజివీడు నుంచి రంగంలోకి దిగటానికి చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ వీరి మధ్య సయోధ్య కుదిరి, ఆ నేత నూజివీడు నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగితే సామాజిక సమీకరణాల్లో పూర్తి న్యాయం జరగటమే కాకుండా, జిల్లాలో మరో మూడు నియోజకవర్గాల్లో మరింత సంతృప్తికరంగా పార్టీ పరిస్థితి ఉంటుందనే యోచనలో టీడీపీ కీలక నాయకులు భావిస్తున్నారు. ఈ నేతతో జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాకే నూజివీడు అభ్యర్థిత్వం విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

Related Posts