YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కేజీ బేసిన్ లో మిథేన్ హైడ్రేట్

కేజీ బేసిన్ లో మిథేన్ హైడ్రేట్

కృష్ణా-గోదావరి బేసిన్‌లో అపార సహజ వాయువు, చమురు నిక్షేపాలు ఉన్నట్లు తెలిసిందే. అయితే భవిష్యత్ తరాలకు అవసమైన సరికొత్త ఇంధన వనరులు ఈ ప్రాంతంలోని సముద్ర భూగర్భంలో ఉన్నట్లు తాజా పరిశోధనలో గుర్తించారు. అదే ‘మిథేన్ హైడ్రేట్’! అదీ మామూలుగా కాదు.. భారత జలాల్లో లక్షల క్యూబిక్ మీటర్ల మిథేన్ గ్యాస్ నిక్షేపాలు హైడ్రేట్ రూపంలో ఉన్నట్లు తెలుసుకున్నారు.ఈ గ్యాస్ హైడ్రేట్స్ భవిష్యత్లో భారత్‌కు ఇంధన వనరుగా మారబోతున్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కేజీ బేసిన్‌లోని బంగాళాఖాతం సముద్రం అడుగుభాగం నుంచి కేవలం రెండు మీటర్ల లోతులోనే మిథేన్ హైడ్రేట్స్ ఉన్నట్లు గుర్తించారు. గోవాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, హైదరాబాద్‌కు చెందిన నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్లకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ ప్రాంతంలో నిర్వహించిన అధ్యయనంలో ఇది బయటపడింది.ఈ వివరాలను ఎర్త్ సిస్టమ్ సైన్స్ అనే జర్నల్‌లో ప్రచురించారు. ‘భారత విశిష్ఠ ఎకనామిక్ జోన్‌లో చైతన్యమంతమైన మిథేన్ ప్రవహాన్ని గుర్తించి, మిథేన్ హైడ్రేట్ నిక్షేపాలు ఎంత లోతులో ఉన్నాయో తెలుసుకుని విడుదల చేసిన మొదటి నివేదిక ఇదే’ అని పేర్కొన్నారు.ముద్ద హారతి కర్పూరంలా కనిపిస్తుంది. మిథేన్‌కు మండే గుణం అధికం. సహజ వాయువుకు ఇదే ప్రధానం. సముద్రంలో లభించే ఇంధనాల్లో మిథేన్ హైడ్రేట్ సరికొత్తది. శిలాజ రూపంలో లభిస్తుంది. తక్కువ ఉష్ణోగ్రతలు, అధిక పీడనాల మధ్య ఏర్పడుతుంది. నీటిలో ఘనరూపంలో ఉండే ఇందులోనే మిథేన్ గ్యాస్ ఉంటుంది. కేజీ బేసిన్లో చాలా నిస్సారమైన లోతులోనే లభించడానికి కారణం ఇక్కడ మిథేన్ నిక్షేపాలు అధికంగా ఉండటమే.గత ఏడాది జనవరి, -ఫిబ్రవరి మధ్య సింధు సాధన పరిశోధన నౌకలో కేజీ బేసిన్‌కు నిపుణుల బృందం వచ్చింది. మల్టీ బీమ్ ఎకో సౌండర్ ద్వారా నీటికి సంబంధించిన చిత్రాలు తీసుకున్నారు. వీటిని పరిశీలించగా.. చైతన్యవంతమైన మిథేన్ నిక్షేపాల జాడలు తెలిశాయి. అందులో నాలుగు విభిన్నమైన గ్యాస్ మంటలు కనిపించాయి. దాంతో ఈ సముద్రపు అడుగుభాగంలో భారీగా మిథేన్ నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.అయితే గ్లోబల్ వార్మింగ్‌లో మిథేన్ ఉద్గారాల పాత్రపై మరిన్ని పరిశోధనలు చేయాలన్నది నిపుణులు సూచిస్తున్నారు.

Related Posts