YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రా, తెలంగాణ మధ్య తుంగభద్ర

ఆంధ్రా, తెలంగాణ మధ్య తుంగభద్ర
 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
 తెలంగాణలో నీటి ముంపు ఉన్నా, ప్రభుత్వ అనుమతి లేకుండానే ఏపీ గుండ్రేవుల రిజర్వాయర్‌ను చేపడుతోంది. తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐదారు గ్రామాలు ఈ రిజర్వాయర్ నిర్మాణంతో ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. సుంకేషుల బ్యారేజికి ఎగువన గుండ్రేవుల దగ్గర 20 టిఎంసిల సామర్థంతో బ్యారేజిని ఎపి డిజైన్ చేసింది. రాజోలిబండ కుడి కాలువకు కూడా అదే సమయంలో శంకుస్థాపన చేస్తారు. ఆర్‌డిఎస్ కెనాల్‌కు ఇప్పటికే నీళ్లు లేక, ఉన్న నీళ్లు రాక ఇబ్బందులు పడుతుంటే, రాజోలిబండ కుడి కాలువ నిర్మాణానికి ఎపి శ్రీకారం చుడుతుండడంతో తెలంగాణలోని ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం ఉంది.దీనికి తోడు నాగల్‌దిన్నె వద్ద ఎత్తిపోతల పథకంతో నీటిని అనంతపురం వరకూ తీసుకెళ్లే కొత్త పథకానికి టెండర్లను కూడా ఖరారు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ పథకాలన్నీ పూర్తయితే తుంగభద్ర నీరు శ్రీశైలంలోకి రాకుండా, ఎగువ నుంచే రాయలసీమకు మళ్ళిపోయే ప్రమాదం ఉంది. రాయలసీమకు ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులతో తెలంగాణ వాటా నీళ్లు, సరిగా రావడంలేదు. ఆర్‌డిఎస్ కుడి కాలువ ప్రతిపాదన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నప్పటికీ, ఆ ట్రిబ్యునల్ తీర్పును ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు ఇంకా అంగీకరించలేదు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. కొత్తగా కడుతున్న, ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులు పూర్తయితే, శ్రీశైలానికి ఎగువనే తుంగభద్ర నీళ్లను పూర్తిగా మళ్లించే ప్రమాదం ఉంది.

Related Posts