YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

23 మంది ఎమ్మెల్యేల పరిస్ధితి ఏమిటన్న చర్చ

 23 మంది ఎమ్మెల్యేల పరిస్ధితి ఏమిటన్న చర్చ
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీలో టికెట్ల ఖరారు కోసం టీడీపీ, వైసీపీ కసరత్తు చేస్తున్న వేళ... గతంలో ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేల పరిస్ధితి ఏమిటన్న చర్చ సాగుతోంది. మరోసారి టికెట్ దక్కించుకోలేకపోతే వీరి పరిస్ధితి రెంటికీ చెడ్డ రేవడిగా మారనుంది. 2014 ఎన్నికల తర్వాత వివిధ కారణాలతో వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు దక్కుతాయా లేదా అన్న చర్చ రాష్ట్రంలో సాగుతోంది. వీరిలో సుజయకృష్ణ రంగారావు, అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు. వీరిలో సుజయకృష్ణ రంగారావు మరోసారి బొబ్బిలి సీటు నుంచి, అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి, అమర్ నాథ్ రెడ్డి పలమనేరు నుంచి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆదినారాయణరెడ్డి మాత్రం రామసుబ్బారెడ్డితో ఒప్పందం ప్రకారం కడప ఎంపీ సీటు నుంచి బరిలోకి దిగనున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోచేరిన ఎమ్మెల్యేల్లో కొందరు. భూమా అఖిలప్రియ తర్వాత టీడీపీ టకెట్‌పై గెలిచారు.మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో జ్యోతుల నెహ్రూకు ఇప్పటికే జగ్గంపేట సీటును చంద్రబాబు ఓకే చేశారు. ఆయన వియ్యంకుడు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు మాత్రం నిరాశ తప్పడం లేదు. సుబ్బారావు స్ధానంలో ఆయనతో పోటీ పడుతున్న మనవడు, డీసీసీబీ ఛైర్మన్ వరుపుల రాజాను టీడీపీ బరిలోకి దింపుతోంది. ఇదే జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీకి ఫిరాయించిన వంతల రాజేశ్వరికి మాత్రం ఈసారి టికెట్ దక్కనుంది. కృష్ణాజిల్లాలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన జలీల్ ఖాన్ స్ధానంలో పశ్చిమ నియోజకవర్గంలో ఆయన కూతురు షబానా ఖాతూన్ కు టీడీపీ అవకాశం ఇవ్వనుంది. ఇదే జిల్లాలో పామర్రు నుంచి గెలిచిన ఉప్పులేటి కల్పనకు టీడీపీ టికెట్ ఇచ్చే పరిస్ధితులు కనిపించడం లేదు. ఆమెకు బదులుగా డీవై దాస్ కు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని టీడీపీ పరిశీలిస్తోంది.ల్లూరు జిల్లా గూడూరులో పాశం సునీల్ కుమార్ కు టీడీపీ టికెట్ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కందుకూరులో పార్టీ ఫిరాయించిన పోతుల రామారావుకు టీడీపీ టికెట్ దక్కనుండగా... మరో నియోజకవర్గం యర్రగొండపాలెంలో డేవిడ్ రాజుకు బదులుగా అజితా రావు పేరును టీడీపీ పరిశీలిస్తోంది. గిద్దలూరులో పార్టీ ఫిరాయించిన అశోక్ రెడ్డి స్ధానంలో త్వరలో పార్టీలో చేరనున్న సాయికల్పనారెడ్డి సహా పలువురి పేర్లను టీడీపీ పరిశీలిస్తోంది. అద్దంకిలో మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు టీడీపీ టికెట్ ఖాయమే. విశాఖ జిల్లా పాడేరులో వైసీపీ నుంచి ఫిరాయించిన గిడ్డి ఈశ్వరికి టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లిన కలమట వెంకటరమణ కూడా టికెట్ దక్కించుకోనున్నారు.అనంతపురం జిల్లా కదిరి నుంచి గెలిచి పార్టీ మారిన అత్తార్ చాంద్ బాషా ఈసారి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన మణి గాంధీకి బదులుగా కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మదన్ మోహన్ కు అవకాశం దక్కనుంది. శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ఈసారి టీడీపీ టికెట్ లభించనుంది. ఇదే జిల్లాలో కర్నూలులో గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎస్వీ మోహన్ రెడ్డి మాత్రం టికెట్ కోసం టీజీ వెంకేటేష్ తనయుడు భరత్ తో పోటీ పడాల్సిన పరిస్ధితి ఉంది. కడప జిల్లా బద్వేలులో ఫిరాయింపు ఎమ్మెల్యే జయరాములుకు బదులుగా లాజరస్ కు టికెట్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయించుకుంది. దీంతో జయరాములుకు నిరాశ తప్పడం లేదు.

Related Posts