YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహుల్ గాంధీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నమోడీ

రాహుల్ గాంధీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నమోడీ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించడమే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లక్ష్యం గా పెట్టుకున్నట్లు వ్యక్తమవుతుంది. ఆయన నియోజకవర్గంలోనే ఓడించేందుకు బిజెపి ‘అమెధీ ప్రయోగం’ను  రిపీట్ చేస్తున్నది.ఈ సారైనా రాహుల్ ఓడిపోకుండా ఉంటాడా అని ప్రధాని మోదీ  భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన లక్ష్యాలలో రాహుల్ ను ఓడించి అమేధీని స్వాదీనం చేసుకోవడం లక్ష్యంగా మోడీ పావులు కదుపుతున్నారు.అమెధీలో రాహుల్ ని ఓడిస్తే, కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న కుటుంబం పరాజయం అయినట్లే, దానితో కాంగ్రెస్ ముక్త భారత్ కల నెరవేరుతుందని ఆయన కోరిక.  దీనికోసం  అమెధీలో 2014 లో జరిపిన ప్రయోగాన్ని మళ్లీ చేయాలనుకుంటున్నది. 2014 నుంచి 2019 దాకా సాగిన మోదీ పాలన బలంతో ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో రాహుల్ ను ఓడించి తీరాలని చూస్తున్నది.గతంలో గురి తప్పినా,  ‘స్మృతి’ మిసైల్ పున: ప్రయోగించాలని ఆయన నిర్ణయించారు. ఆందర్ని ఆశ్చర్య పరిచారు.ఒక వైపు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు పోటీ చేసే చోట తమ అభ్యర్థులను నిలబెట్ట రాదని బహుజన్ సమాజ్ వాది పార్టీ, సమాజ్ వాది పార్టీ ప్రకటిస్తే ఎలాంటి సంకోచం లేకుండా రాహుల్ గాంధీ మీద అమెధీలో నిలబెట్టే అభ్యర్థిని ప్రధాని మోదీ ప్రకటించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమెధీ నుంచి రాహుల్ మీద ఈ సారి కూడా పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు.సాధారణంగా పార్టీ అధ్యక్షులు పోటీ చేసే చోట అవతలి పార్టీ వాళ్లు పనిగట్టుకుని బయటి నుంచి అభ్యర్థులను రప్పించి పోటీ పెట్టించడం చాలా అరుదు. ఇద్దరు బయటి నుంచి వచ్చి పోటీ చేస్తున్నపుడు వేరు. 1999లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బళ్లారి నుంచి పోటీ చేయాలనుకున్నపుడు భారతీయ జనతా పార్టీ ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి సుష్మా స్వరాజ్ బళ్లారికి రప్పించి నిలబెట్టారు.అదే విధంగా 2014లో వారణాసి నుంచి నరేంద్రమోదీ పోటీచేస్తున్నపుడు ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ వచ్చి పోటీ చేశారు. అయితే ఇరుప క్షాల వాళ్లు బయటి వారే.అలా కాకుండా ఒకపార్టీ నేత స్థిరపడిన నియోజకవర్గంలో ఆయన్ను ఓడిచేందుకు సెలెబ్రిటీని ఎక్కడి నుంచో రప్పించి రంగంలోకిదించడం జరగదు. అయితే బిజెపి అమేధీలో ఈ ప్రయోగం మళ్లీ చేస్తున్నది.2014 లో ఇదే ప్రయోగం చేసింది. అపుడు స్మృతి జూబిన్ ఇరానీ దాదాపు లక్ష వోట్ల తేడాతో ఓడిపోయారు. అయనా సరే, రాహుల్ ను ఓడించేందుకు మళ్ళీ ఆమెనే రంగంలోకి దించుతున్నారు.ఆదివారం నాడు అమేధీలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ అమేధీ లో బిజెపి అభ్యర్థి స్మతి ఇరానీయే నని ప్రటించేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అమేదీ కొత్త చరిత్రను లిఖిస్తుందని ప్రకటించారు. అక్కడ ఎకె సీరీస్ అసాల్ట్ రైఫిల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత ప్రధాని ప్రసంగించారు. రాహుల్ ను తీవ్రంగా దుయ్యబడుతూ, ప్రజల కేమీ చేయకుండా కాలం వెల్ల బుచ్చుతున్న రాహుల్ ను ఈ సారి ఎన్నుకోవద్దని అమెధీ ప్రజలకు పిలుపునిచ్చారు.‘నేను కచ్చితంగా చెబుతున్నాను, అమెధీ కొత్త చరిత్ర సృష్టించబోతున్నది, ఈ కొత్త చరిత్ర భారత దేశాన్ని యావత్తు ప్రభావితం చేయబోతన్నది,’ అని మోదీ చెప్పారు. ఆదే సమయంలో ఆయన స్మతి ఇరానీని విపరీతంగా ప్రశంసించారు. 2015 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆమె నియోజకవర్గం అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.‘2014 ఎన్నికల్లో స్మృతి ఇరానీ ఇక్కడికి (అమేధీ) బిజెపి అభ్యర్థిగా వచ్చారు. అపుడామే ఎన్నికల్లో గెలవలేకపోయారు. అయితే, ప్రజల హృదయాలను గెలిచారు. స్మృతి నియోజకవర్గం అభివృద్ధికి అప్పటి నుంచి ఎంతో కృషి చేస్తున్నారు,’ అని అన్నారు.ఇక్కడ ప్రారంభిస్తున్న రైఫిల్ ఫ్యాక్టరీ నిర్మాణం జాప్యం అయ్యేందుకు కారణం రాహుల్ గాంధీయేనని ఆయన అన్నారు.ప్రధాని మోదీ చెబుతున్నట్లు రాహుల్ ఓటమి దేశరాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అనుమానం లేదు.

Related Posts