YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

2020లో జపాన్ లో జరిగే ఒలింపిక్స్ లో పొగ రాయుల్లకు ప్రవేశం నిషేధం

 2020లో జపాన్ లో జరిగే ఒలింపిక్స్ లో పొగ రాయుల్లకు ప్రవేశం నిషేధం
గుప్పు గుప్పు మని సిగిరెట్ లు ఊదేసే సరదా రాయుళ్లకు జపాన్ లో 2020లో జరిగే ఒలింపిక్స్ లోనూ, పారా ఒలింపిక్స్ లోనూ ప్రవేశం లేదంటున్నారు నిర్వాహకులు పేర్కొంటున్నారు. జపాన్ 2020లో ఒలింపిక్స్ నిర్వహిస్తున్నది. అలాగే పారా ఒలింపిక్స్. ఈ ఒలింపిక్ క్రీడలు జరిగే అన్ని మైదానాలలోనూ, చుట్టు పక్కల ప్రాంతాలలో కూడా పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించారు. ఆ నిషేధాన్ని 100 శాతం అమలు చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.క్రీడాకారులు, ప్రేక్షకులు, క్రీడా సంఘాల అధికారుల ఆరోగ్యం దృష్ట్యా అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం నియమావళి కచ్చితంగా అమలు చేసేందుకు, జపాన్ ప్రభుత్వం గట్టి కృషి చేస్తున్నది. ఉల్లంఘించిన వారికి కఠినమైన శిక్ష విధించేందుకు అవసరమైన చట్టాలను సిద్ధం చేస్తున్నారు.2012 లండన్ ఒలింపిక్స్, 2016 రియో డిజెనెరో ఒలింపిక్స్ సందర్భంగా క్రీడా ప్రాంగణాల వెలుపల పొగతాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కానీ, జపాన్ లో క్రీడా ప్రాంగణాల వద్ద అలాంటి సౌకర్యాలు ఉండబోవని సుస్పష్టం చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే స్కూళ్లు, ఆస్పత్రులు, ప్రార్థనా స్థలాల్లో పొగతాగడాన్ని నిషేధించారు. అలాగే డబ్బు వేస్తే.. సిగిరెట్లు ధారగా పడే యంత్రాలను దేశంలో తొలగించారు. కానీ, చిన్న హోటళ్లు, బార్ లు, ఇతర బహిరంగ స్థలాల్లో పొగతాగేందుకు అనుమతి ఇస్తూనే ఉన్నారు. టీవీల్లో, సినిమా హాళ్లలో పొగాకు ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం లేదు.పొగతాగే జనాభా ప్రపంచ వ్యప్తంగా పెరుగుతూనే ఉంది. 2020 జపాన్ ఒలింపిక్స్ జరిగే క్రీడా ప్రాంగణాలతో పాటు దేశంలోని అన్ని ఇండోర్, ఔట్ డోర్ క్రీడా ప్రాంగణాలలోనూ నిషేధం అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. 2018లో పయాంగ్ ఛాంగ్ వింటర్ ఒలింపిక్ క్రీడల సందర్భంగా ఇదే విధానాన్ని విజయవంతంగా అమలు చేశారు. 
అయితే ప్రపంచంలో అత్యధికంగా సిగిరెట్లు ఉత్పత్తి చేసే జపాన్ కంపెనీ ఆ దేశ ప్రభుత్వరంగ పరిశ్రమ అంటే ఆశ్చర్యం కలగక మానదు. నిజానికి భారతదేశంతో సహా పలు దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడాన్ని నిషేధించినా, పొగాకు కేన్సర్ కు కారణం.. అని బోర్డులు పెట్టినా.. సిగిరెట్ పెట్టెలపై తాటికాయంత అక్షరాలతో రాసినా ఆ అలవాటు గలవాళ్లను కట్టడి చేయడం ఏ ప్రభుత్వాలకూ సాధ్యం కావడం లేదు. మనదేశంతో పోలిస్తే.. జపాన్ లో పొగతాగే అలవాటు ఉన్న జనాభా ఎక్కువే. 2020 ఒలింపిక్స్ సందర్భంగా జపాన్ వ్యాప్తంగా పొగాకు వ్యతిరేక ప్రచారం ముమ్మరం చేసే ఏర్పాట్లు సాగుతున్నాయి. జపాన్ లో ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకుల నుంచి హోటళ్లు, బార్లలో సామాన్యజనం యథేచ్ఛగా పొగాకు వినియోగిస్తుంటారు. చాలా అనారోగ్యాలకు మూలమైన ఈ పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేసినా పెద్దగా ఫలితం లేకపోవడంతో ఈ సారి ఒలింపిక్స్ వేదికగా జపాన్ లో ఓ విప్లవాత్మక మార్పు తెచ్చేందుకు క్రీడల నిర్వాహకులు కంకణం కట్టు కుంటున్నారు.ఒలింపిక్స్ లో పతకాల పంట పండించడం తో పాటు దేశ ప్రజల ఆరోగ్యం మెరుగు పరచడమే టోక్యో 2020 ఒలింపిక్స్ లక్ష్యం. జపాన్ జనాభాలో ఐదో వంతు జనం స్మోకర్లే. పొగతాగడం వల్ల అనారోగ్యం పాలయ్యే వారి సంఖ్య ఎక్కువే. సిగిరెట్ తాగా వారి కన్నా.. ఆ పొగ పీల్చడం వల్ల ఏటా 15 వేల మంది మహిళలు, పిల్లలు చని పోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, జపాన్ లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. వచ్చే ఏడాది కల్లా దేశంలో దేశంలోని 80శాతం పైగా హోటళ్లు, కేఫేలను స్మోకింగ్ ఫ్రీ జోన్ లుగా ప్రకటించేందుకు జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.ఈ మధ్య భారతదేశంలోని బెంగళూరులో ఎయిర్ షో సందర్భంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ 300 కార్లు, చెన్నైలోని పోరూర్ లో ఓ పెద్ద ఆసుపత్రి వద్ద పార్కింగ్ స్థలంలో జరిగిన ప్రమాదంలో 200 పైగా కార్లు దగ్ధమయ్యాయి. చెన్నై వద్ద జరిగిన ప్రమాదానికి ఎవరో నిర్లక్ష్యంగా విసిరేసిన సిగిరెట్ పీక కారణమన్న ఆరోపణ ఉంది. క్రీడా ప్రాంగణాల వద్ద పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నిషేధించడం వల్ల అలాంటి ప్రమాదాలను అరికట్ట వచ్చు. ఇక పొగ తాగడం నిషేధించడం వల్ల ఒలింపిక్స్ కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మాత్రం తగ్గే అవకాశాలు ఉన్నాయి. క్రీడా ప్రాంగణాల వద్ద కలెక్షన్లు కూడా తగ్గే అవకాశం లేకపోలేదు.

Related Posts