YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆత్మాహుతిదళాలకు శిక్షణా కేంద్రం బాలాకోట్

 ఆత్మాహుతిదళాలకు శిక్షణా కేంద్రం బాలాకోట్
ఆత్మాహుతిదళాలకు శిక్షణా కేంద్రం బాల కోట్. బాలాకోట్‌లో శిక్షణ పొందినవారు అఫ్గనిస్థాన్‌లో అమెరికా దళాలపై యుద్ధానికి గానీ, లేక కశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించడానికి పంపిస్తారు. ఆత్మాహుతి దాడికి సంబంధించిన ఒప్పందాలు బాలాకోట్‌లోనే జరుగుతాయి. గతంలోనే ఈ విషయం మన భద్రతా బలగాల దృష్టికి వచ్చింది. అక్కడ శిక్షణ పొందిన నలుగురు ఉగ్రవాదులను 2014 నుంచి 2017లోపు సైనిక దళాలు అదుపులోకి తీసుకొన్నాయి. విచారణలో వారు బాలాకోట్‌ శిబిరం గురించి  పలు కీలక విషయాలను బయటపెట్టారు. ఇక్కడ మూడునెలల పాటు ఉగ్రవాదులకు యుద్ధశిక్షణ ఇచ్చేవారు. దీనికి ‘దౌరా ఈ  ఖాస్‌’ అని పేరుపెట్టారు. అత్యాధునిక ఆయుధాల శిక్షణ కార్యక్రమాన్ని ‘దౌరా అల్‌ రాద్‌’గా వ్యవహరిస్తారు.వకాస్‌ మన్సూర్‌ అనే ఉగ్రవాదిని 2014-15లో అరెస్టు చేశారు. ఖైబర్‌ పఖ్తంక్వాకు చెందిన వకాస్‌ బాలాకోట్‌లోనే శిక్షణ పొంది 2007లో భారత్‌లో అడుగుపెట్టాడు. అతనితోపాటు మరో100 మందికూడా శిక్షణ పొందారు. వీరిలో 60 మంది అఫ్గానిస్థాన్‌ వెళ్లగా.. 40 మంది కశ్మీర్‌లో చొరబడ్డారు. భద్రతా దళాలపై జరిగిన పలు దాడుల్లో వకాస్‌ నిందితుడు. తర్వాత లష్కరేలో చేరి పాక్‌లోని మన్సెరాలో శిక్షణ పొందాడు. ఈ విషయాలన్నీ వకాస్‌ విచారణలో వెల్లడించాడు.2016 జైషే ఉగ్రవాది అబ్దుల్‌ రెహ్మాన్‌ ముఘల్‌ను భారత దళాలు అరెస్టు చేశాయి. అతను ఇంటరాగేషన్‌లో కీలక విషయాలను వెల్లడించాడు. భారత్‌లో  చొరబడే ప్రతి ఉగ్రవాదికి కోడ్‌ నేమ్‌ ఉంటుంది. ముఘల్‌ కోడ్‌నేమ్‌ రోమియో. కశ్మీర్‌లో శిక్షణ శిబిరాలు పెట్టడం అతని విధి. ‘‘ఆత్మాహుతి బాంబర్‌గా మారాలి అనుకొనేవారు  తొలుత దరఖాస్తు చేసుకోవాలి. బాలాకోట్‌ క్యాంప్‌లోని కమాండర్‌ ఎదుట ఆ విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలి.’’ అని ముఘల్‌ ఇంటరాగేషన్‌లో వెల్లడించాడు.  
80 మంది శిక్షకులు..
బాలాకోట్‌లోని ఉగ్రశిబిరంలో 80 మంది శిక్షకులు ఉన్నారని మరో ఉగ్రవాది నాసిర్‌ మొహూద్‌ అవానీ వెల్లడించినట్లు అధికారులు పేర్కొన్నారు. రేడియో కశ్మీర్‌పై దాడి కేసులో నిందితుడైన నాసిర్‌ను 2014లో అరెస్టు చేశారు. నాసిర్‌ పాకిస్థానే వాసే.మొహద్‌ సాజిద్‌ గుజ్జార్‌ను 2015లో అరెస్టు చేశారు. అతను కూడా బాలాకోట్‌లోనే శిక్షణ పొందాడు. భారత్‌లో అరెస్టయిన ఏడాదే మరో ముగ్గురితో కలిసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. దీంతో రక్షణదళాలు 2015లోనే అతన్ని కాల్చిచంపాయి.

Related Posts