గోదావరి నదిలో శివరాత్రిని పురస్కరించుకొని సుమారు 50 వేల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పట్టణ సిఐ శ్రీనివాస్ తో పాటు మున్సిపాల్ సిబ్బంది అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ప్రెస్ క్లబ్అధ్యక్షులు మైలారం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి వంగల మధుసూదన్ ఆధ్వర్యంలో కుమారు 50 మంది యువకులు వాలంటీర్లుగా సేవలనుఅందించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చేశారు అదేవిధంగా మనమంతా ఒకటేనని భేదంలేకుండా ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మందికి మజ్జిగ ప్యాకెట్లు అందజేసారు. పుణ్య స్నానాలకు వచ్చిన భక్తులకు ఏర్పాటుచేసిన సౌకర్యాలను మంచిర్యాల ఎమ్మెల్యే నడి పెళ్లి దివాకర్ రావు పరిశీలించారు పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులను సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు స్థానిక పాత బస్టాండ్ లో ఇందు ఉత్సవ సమితి సభ్యులతోపాటు హనుమాన్ భక్త బృందం ఐక్య వ్యాపార సంఘం సాయి సేవ సమితి సభ్యులు ఆధ్వర్యంలో పండ్లు మజ్జిగ వాటర్ ప్యాకెట్లు భక్తులకు అందజేశారు మహాశివరాత్రి సోమ వారం కావడం తో పట్టణ శివాలయం తో పాటు గంగా మాత సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఈ కార్యక్రమంలో ముస్లింమైనార్టీ నాయకులు ఇందు ఉత్సవ నాయకులు ఐక్య వ్యాపార సంఘ నాయకులు పాల్గొన్నారు