శబ్ద విజ్ఞానము:
అ:
‘అ’ ఉచ్చారణ కంఠము ద్వారా జరుగుతుంది. దీని ప్రభావము హృదయము మీద పడుతుంది .అందువలన “అ” అని ఎన్ని సార్లు ఉచ్చారణ చేసినా వినినా అన్ని సార్లు హృదయము మీద ప్రభావము పడుతుంది. శరీరములో రక్తమును శుద్ధి చేసే క్రియ హృదయము ద్వారానే జరుగుతుంది. హృదయము చెడు రక్తమును ఉపిరితిత్తు
లకు పంపుతుంది.అక్కడ శుద్ధి చేయబడిన రక్తము మళ్లీ హృదయానికి వెళ్లి అక్కడి నుండి రోగ గ్రస్తమైన అంగానికి వెళ్లినప్పుడు రోగ నివారణ జరుగుతుంది “అ “అనే అక్షరము శుద్ధ రక్తమును సంచారము చేస్తుంది. మంత్ర శాస్త్రములో “అ “అనేస్వరము “రచనాత్మక శక్తి సంపన్నము గా” చెప్పబడు తుంది .దానిని నిర్మాణాత్మక శక్తీ అని కూడా అంటారు .”అ”క్షరాణం అకారోస్మి ,అని శ్రీ కృష్ణుడు గీతలో చెప్తాడు .
ఆ:
‘ఆ’ యొక్క శుద్ధి ప్రభావము ఊపిరితిత్తుల పై భాగము మీద, ఛాతి మీద పడుతుంది. మస్తిష్కమును వికసింప చేస్తుంది. బద్దకాన్ని పోగొడుతుంది. ఊపిరితిత్తు లను ఉత్తేజము చేసి దాని పై భాగమును శుద్ధి చేస్తుంది. దీని అభ్యాసము వలన దగ్గు, ఆయాసము తగ్గిపోతాయి. క్షయ రోగులు, క్షయ రోగ సంభావన ఉన్నవారు దీనిని తప్పని సరిగా అబ్యాసము చేయుట ఎంతైనా చాల మంచిది .
ఇ – ఈ:
ఈ స్వరము దీర్ఘ ఉచ్ఛారణ మెడ, మస్తిష్కమును ప్రభావితము చేస్తుంది. శ్వాస ఇంద్రియములో ఏకత్రితమై ఉన్న కఫమును బైటకు నెట్టి ఈ అంగమును శుభ్రపరుస్తాయి. వీటి ప్రభావము శరీరము యొక్క పై భాగముల మీద కూడా పడుతుంది. తలనొప్పి మరియు హృద్రోగాలకు లాభ దాయకము. ఉదాసీనత, నిర్లిప్త స్వభావము గల వారికి, క్రోధము వచ్చే వారికీ ఇది చాల ఉపయోగకారిణి
ఉ – ఊ:
ఈ స్వరము ఉచ్చారణ వల్ల కడుపు, కాలేయము,
జీర్ణాశయము మీద వీటి ప్రభావము పడుతుంది
గర్భాశయము యొక్క భారమును తగ్గించును వాటి నిమ్న బాగాములో బాధపడే స్త్రీలు “ఉ-ఊ ” ఉచ్చారణ చేసిన చేసేటప్పుడు విన్నా ఖచ్చితముగా లాభమును పొందగలుగుతారు. ఎంత దీర్ఘ కాలిక మల బద్ధకం ఉన్నా దీని ద్వరా దూరము చేసుకోన వచ్చు. ఇది స్త్రీల యొక్క
గర్భసంచికి సంబంధించిన బాధల నివారణకు బాగా ఉపయోగ పడుతుంది .
ఏ – ఐ:
ఈ అక్షరముల స్వరముల ఉచ్చారణ ప్రభావము మెడ మరియు శ్వాస నాలికల ఉద్భవస్తానము మీద పడుతుంది. మూత్ర పిండాలు ఉత్తేజిమవుతాయి. దీనిని అనేక సార్లు ఉచ్ఛరించటం వల్ల లేక వినుట వల్ల మూత్ర సంబందమైన అనేక రోగాలు దూరమవుతాయి. మూత్రము రాక బాధపడే వారికీ ఇది ఔషదముగా పని చేస్తుంది. పాటలు పడే వారికీ, అధ్యాపకులకు, ఎక్కువ మాట్లాడే వారికీ ఈ స్వర ప్రయోగము విశేష లాభ దాయకము. నాలిక లోపల ఉన్న జిగట పొరలను ఆరోగ్య వంతము చేస్తుంది .
ఓ -ఔ:
ఈ అక్షర స్వర ప్రభావము ఉపస్థేంద్రియము మరియు జననేంద్రియముల మీద ఉంటుంది ఈ స్వరములు అవి స్వాభావికముగా మరియు సహజముగా పని చేయుటకు సహాయ పడతాయి. దీని ఉచ్ఛారణ బాగా అభ్యాసించి నప్పుడు బలహీనమైన నరాలు శక్తివంతమై హాయిగా తమ స్వాబావిక క్రియా కలాపా లను చేయగలుగుతాయి. ఇది చాతి యొక్క మధ్య భాగమును ఉత్తేజితము చేస్తుంది. న్యుమోనియా మరయు ఫ్లురసీ లాంటి రోగాలు నివారణలో ఇది చాల లాభదాయకము .
అం:
ఈ అక్షరాల ఉచ్ఛారణలో నాసిక ద్వరా తీసుకొనే శ్వాస తో పాటు ఆక్సిజన్ మరియు ప్రాణశక్తి శరీరములోకి వెళుతుంది. అది చెడు రక్తము ను శుద్ధముగాను మరియు ఎర్రగాను చేస్తుంది నాసిక ద్వారా శ్వాసను తీసుకొనుట లో నాసిక మరియు శ్వాస నాలికలను ఉపయోగించు కోవాలి. అందువల్ల ఈ అంగములు వికార రహితము మరియు రోగ రహితముగా ఉండుట అత్యావశ్యకము ఈ అభిప్రాయముతోనే మన మహర్షులు ప్రతీ భీజ మంత్రము చివరిలో “మ్”లేక అనుస్వర [అం] మును పెట్టారు. దానిని చాలాసేపు సాగదీసి ఉచ్ఛారణ చెయ్యమన్నారు. స్వరముల ఉచ్ఛారణ సమయములో నోరు తెరుచుకుంటుంది అనుస్వర ఉచ్ఛారణ సమయములో పెదవులు మూసుకుంటాయి.
అః:
ఈ స్వరం ఉచ్ఛారణ వలన జిహ్వ, అంగిలి యొక్క అగ్ర బాగాన్ని సృశిస్తుంది. దీని ప్రభావము వలన మస్తిష్కము లో సంచాలనముత్పన్నమై ఒక విదమైన రసము స్రవిస్తుంది దానిని సెరేబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. అది కంఠము ద్వారా లోనికి వెళ్లి శరీరము యొక్క అన్ని వికారములను దూరము చేస్తుంది. ఛాతి మరియు గొంతుకను ఉత్తెజింపచేసి వాటిని శక్తి వంతముగా, పుష్టి వంతముగాను చేస్తుంది .
పాణిని మహిర్షి (వైయ్యాకరణుడు – వ్యాకరణ పండితుడు) ‘పాణనీయశిక్ష’ లో వైదిక పదాలను ఎంత శ్రద్ధతో ఉచ్ఛరించాలో ఒక శ్లోకంలో ఇట్లా పేర్కొంటాడు.
వ్యాఘ్రీ యథా హరేత్ పుత్రాన్
దంష్ట్రాభ్యాం చ న పీడయేత్!
భీతాపతనభేదాభ్యాం తత్తద్వర్ణాన్ ప్రయోజయేత్!!
వేదాక్షరాలను స్పష్టంగా పలకాలి. శబ్దాలకి మచ్చ రాకూడదు. శబ్దం అణగిపో కూడదు. హీనమైపో కూడదు. పెరుగుతున్నట్టుఉండకూడదు. శబ్దాలను అశ్రద్ధగా, పేలవంగా ఉచ్చరించకూడదు కటువు గానూ ఉచ్చరించకూడదు. పులి తన పిల్లలను ఎట్లా పట్టుకొంటుంది? పులులూ, పిల్లులూ తమ సంతానాన్ని పళ్లతో పట్టుకొంటాయి. పిల్ల జారిపోకుండా పళ్లు గట్టిగా పట్టుకొంటాయి అయినా పిల్లకి ఏ విధమైన బాధా, గాయమూ కాదు.ఆ విధంగానే మాటలను సున్నితంగా, ధృఢంగా పలకాలి అంటాడు పాణిని.
మంత్ర పఠనంలో అప్రమత్తత అవసరం. శబ్దోచ్ఛారణలో పొరపాటు జరిగితే మంత్రం సరియైన ఫలమివ్వకపోగా హానిని గాని, వ్యతిరేక ఫలితాలని గాని ఇస్తుంది. తైత్తిరీయ సంహితలో ఈ విషయాన్ని తెల్పే కథ ఒకటుంది. (2.4.12)
త్వష్టుడుకి ఇంద్రునితో వైరం. ఇంద్రుని సంహరించగల కుమారుడు కావాలని కోరుకొంటాడు. అందుకని ”ఇంద్రశత్రుర్వర్ధస్వ” అన్న మంత్రాన్ని జపిస్తూ ఒక హోమాన్ని చేశాడు. ఈ మంత్రాన్ని సరిగ్గా పఠించే పద్దతిలో పలికితే, ”త్వష్టుని కుమారుడు పెరిగి ఇంద్రుని వధించుగాక” అనే అర్థం వస్తుంది. ఆ శబ్ద ప్రాబల్యం వల్లనే ఆ కుమారుడు పెరిగి ఇంద్రుని వధింపగలిగే వాడు. కాని శబ్దోచ్ఛారణలో త్వష్టుడు పొరపాటు చేశాడు. అందువల్ల అర్థం తారుమారైంది. అక్షరాలూ, పదాలూ మారక పోయినా స్వరోచ్చారణ దోషం వల్ల, త్వష్టుడు ఆశించిన దానికి సరిగ్గా వ్యతిరేకం జరిగింది. అతని కుమారుని ఇంద్రుడే చంపివేశాడు. అందువల్ల వృత్రుడన్న (వృత్రాసురుడు) అతని కుమారుని వధకు త్వష్టుడే కారణమయినాడు. వేదాల లోని ఈ ఉదంతాన్ని చెప్తూ, సరియైన పద్ధతిలో మంత్రాలని పలకాలంటుంది ఈ శ్లోకం :
???? ”మంత్రో హీనస్వరతో వర్ణతో వా
మిథ్యాప్రయుక్తో న తమర్థమాహ
స వాగ్వజ్రో యజమానం హినస్తి
యతేంద్రశత్రుః స్వరతోపరాధాత్ ” ????
???????????????? జై శ్రీమన్నారాయణ ????????????????