YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భీమిలీ సీట్ హాట్ కేక్

భీమిలీ సీట్ హాట్ కేక్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఉత్తరాంధ్ర జిల్లాలు బాగా వెనకబడినవి. అయినా ఇక్కడ రాజకీ చైతన్యం మాత్రం బాగా ఉంది. కొత్త పార్టీలను ఆదరించి అక్కున చేరుకోవడంలో చాలా ముందుంటాయి. అప్పట్లో తెలుగుదేశం, ఆ తరువాత ప్రజారాజ్యం, 2014 ఎన్నికల్లో వైసీపీని కూడా ఆదరించి సీట్లు, ఓట్లు కట్టబెట్టాయి. ప్రస్తుత విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలని జనసెనాని పవన్ కళ్యాణ్ ఆశపడుతున్నారు. ఆయన తన దరఖాస్తుని పార్టీ నాయకులు ఇచ్చినపుడు ఉత్తరాంధ్రలో ఏదో ఒక సీటు నించి తన పేరు ప్రతిపాదించమని కోరారని సమాచారం. ఇక మరో వైపు టీడీపీ భావి నాయకుడు నారా లోకేష్ పేరు కూడా బాగా వినిపిస్తోంది. ఆయన విశాఖ జిల్లా భీమునిపట్నం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు.టీడీపీలో చంద్రబాబు తరువాత స్థానంలో ఉన్న లోకేష్ భీమిలి నుంచి పోటీ చేస్తారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ మేరకు ఆ పార్టీ భీమిలిలో ఓ సర్వే కూడా నిర్వహించింది. మెజారిటీ ప్రజలు లోకేష్ వస్తే ఓటు వేస్తామని, తమకు ప్రభుత్వం ఇంకా బాగా దగ్గర అవుతుందని చెప్పారట. ఇక్కడ మొదటి నుంచి టీడీపీకే జనం పట్టం కడుతున్నారు. ఆ పార్టీ పెట్టాక ఇప్పటికి ఎనిమిది ఎన్నికలు జరిగితే ఆరు సార్లు టీడీపీ బంపర్ మెజారిటీతో గెలిస్తే ఓ మారు కాంగ్రెస్, మరో సారి ప్రజారాజ్యం గెలిచాయి. దాంతో ఈ కంచుకోట నుంచి లోకేష్ బరిలో ఉంటే ఆయన రికార్డ్ మెజారిటీతో గెలవడమె కాకుండా ఉత్తరాంధ్రలోనూ సైకిలు పరుగు జోరు మీద ఉంటుందని భావిస్తున్నారు. మంత్రి శ్రీనివాసరావు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయనే లోకేష్ పేరుని ప్రతిపాదిస్తున్నారు. ఇక్కడ వైసీపీ ఈ మధ్య బాగా పుంజుకోవడంతో పాటు, టీడీపీ అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీకి రెడీ అవడం కూడా టీడీపీలో పట్టుదల పెంచిందని అంటున్నారు.ఇక పవన్ ఉత్తరాంధ్రా జిల్లాలలో పార్టీని పటిష్టం చేయాలని భావిస్తున్నారు. ఆయన విశాఖ జిల్లాలోని గాజువాక, ఉత్తరం, భీమిలి సీట్లపై చూపు పెట్టారని అంటున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని వెనకబడిన పలాస వంటి చోట్ల కూడా పోటీకి దిగాలనుకుంటున్నారని సమాచారం. పవన్ ప్రజారాజ్యం నాటి అనుభవాలను పరిగణనలోకి తీసుకుని అప్పట్లో నాలుగు సీట్లు ఇచ్చి ఆదరించిన ఉత్తరాంధ్ర జనసేనకు కూడా బలాన్ని ఇస్తుందని నమ్ముతున్నారు. పైగా ఇక్కడ మెగా ఫ్యాన్స్ దండీగా ఉండడం, కాపులు, బీసీలు ఉండడం కూడా పార్టీ గెలుపునకు అవకాశం ఇస్తుందని భావిస్తున్నారు. అదే జరిగితే పవన్, ఇటు లోకేష్ ఇద్దరితో ఈ ప్రాంతాలకు ఏపీలో మంచి గుర్తింపు వస్తుందని అంటున్నారు.

Related Posts