యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో రైలు ప్రమాదం తప్పింది. యశ్వంత్పూర్ నుంచి టాటానగర్ వెళ్లే రైల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామునల రైల్లోని ప్యాంట్రీకారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. రైలులో మొత్తం 23 బోగీలు ఉండగా 9వ బోగీ అయిన పాంట్రీకార్ లో మంటలు వచ్చాయి. వీటిని గుర్తించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగారు. ఆపై రైల్వే సిబ్బంది కూడా బోగీలను వేరుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. అగ్నిప్రమాదంతో విజయవాడ-విశాఖ మధ్య పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.