యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పంచముఖ పోటీ జరుగుతుంది. తెదేపా, కాంగ్రెస్, వైకాపా, జనసేన వామపక్షాలతో కలిసి పోటీ చేయనున్నాయి. విభజన హామీల అమలు కాంగ్రెస్ కు తప్ప మరే పార్టీ కి సాధ్యం కాదని ఏపీసీసీ మీడియా కో ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ తులసి రెడ్డి అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు.
ప్రాంతీయ పార్టీలది మధ్య దళారుల పాత్ర మాత్రమే,భాజపా హోదా ఇవ్వమని అని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి హోదా వస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. హోదా కై భాజపా ఎదురుపోటు, టి ఆర్ యస్ పక్కపోటు,జగన్ వెన్నుపోటు,తెదేపా అవకాశవాద పోటు పొడిచాయి. జగన్ హోదా ఇచ్చేవారికే మద్దతు అంటారు కాంగ్రెస్ ఇస్తామంటే ,కాంగ్రెస్ ర్యాలీ లకు వైకాపా అడ్డుతగులుతారని అన్నారు. హోదా ఇవ్వమని అని చెప్పినా భాజపా సభలకు జన సమీకరణాలు చేస్తారు. హోదాకు అడ్డు తగిలే తెరాసా తో కలిసి చెట్టా పట్టాల్ వేసుకుని తిరుగుతారని అయన విమర్శించారు. జగన్ ది హోదా విషయంలో వెన్నుపోటు, ఇవ్వమని చెప్పినా భాజపా ను పల్లెత్తు మాట అనరని అయన అన్నారు.