YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

విలాసవంతమైన కార్

Highlights

  • ఎత్ జనరేషన్ ఫాంటమ్ కారు
  • అ కార్ ఖరీదు అక్షరాలా రూ.12 కోట్లు
  • సౌత్ లో వ్యాపార వృద్ధి
  •  రోల్స్‌ రాయిస్‌ మోటార్‌ కార్స్‌ (ఆసియా–పసిఫిక్‌) రీజినల్‌ డైరెక్టర్‌ పాల్‌ హారిస్‌ 
విలాసవంతమైన కార్

విలాసవంత ప్రయాణానికి పేరు  రోల్స్ రాయిస్ కార్లు పెట్టింది పేరు .  రోల్స్ రాయిస్ అలాంటి రోల్స్ రాయిస్ విలాసాన్ని మరో పదడుగులు ముందుకు తీసుకెళ్ళి 8వ జనరేషన్ ఫాంటమ్ కారును భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.9.5 కోట్లు. ప్రొడక్టు పోర్ట్‌ ఫోలియో విస్తరణ భాగంలో కంపెనీ ఈ కారును ఆవిష్కరించింది. దక్షిణ భారతదేశంలో వ్యాపారం బాగా వృద్ధి చెందుతోంది’ అని రోల్స్‌ రాయిస్‌ మోటార్‌ కార్స్‌ (ఆసియా–పసిఫిక్‌) రీజినల్‌ డైరెక్టర్‌ పాల్‌ హారిస్‌ తెలిపారు. సాధారణంగా కోటి రూపాయల కారు అంటే అవాక్కు అవటం సహజం. కానీ ఒక కారు ధర ఏకంగా 12 కోట్ల రూపాయలంటే విన్న వాళ్ళ పరిస్థితి చూడండి ఏలా ఉంటుందో..నిజంగా అలాంటి పరిస్థితే ఎదురైతే  అవాక్కు అవటం తప్పించి చేసేదేమీ లేదు. మహా చేస్తే చూసి ఆశ్చర్యపోవడం మినహా చేసేదేమి ఉండదు.  
 కేయూఎన్‌ ఎక్స్‌క్లూజివ్‌ చెన్నై, హైదరాబాద్‌లో కంపెనీకి అధికారిక డీలర్‌గా వ్యవహరిస్తుందని హారిస్ తెలిపారు. కాగా రోల్స్‌ రాయిస్‌కి దక్షిణ భారతదేశంలో ఐదు ఔట్‌లెట్స్‌ ఉన్నాయి. ఫాంటమ్‌–8లో 6.75 లీటర్‌ ట్విన్‌ టర్బోచార్జ్‌ డ్‌ వీ–12 ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.4 సెకన్లలో అందుకుంటుందని పేర్కొంది. ఇక ఫాంటమ్‌ స్టాండర్డ్‌ వీల్‌బేస్‌ వేరియంట్‌ ధర రూ.9.5 కోట్లుగా, ఫాంటమ్‌ ఎక్స్‌ టెండెడ్‌ వీల్‌బేస్‌ వేరియంట్‌ ధర రూ.11.35 కోట్లుగా ఉంటుందని తెలిపింది.

Related Posts