YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాలుష్య నగరాల్లో ఢిల్లీ టాప్

కాలుష్య  నగరాల్లో ఢిల్లీ టాప్
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ప్రపంచంలోనే 20 అత్యంత కాలుష్యపూరిత నగరాల వివరాలు చూస్తే భారత్ లో కాలుష్యం ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో అర్థమవుతోంది. టాప్ 20 అత్యంత కాలుష్యపూరిత  నగరాలలో 15 భారత్లో ఉండటం గమనార్హం. ఎయిర్ విజువల్, ఎన్జీవో గ్రీన్పీస్ సంస్థలు చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పీఎమ్(పర్టిక్యులేట్ మ్యాటర్) 2.5  ఆధారంగా నగరాల కాలుష్యాన్ని వెల్లడించారు. 2017కుగానూ టాప్ 20లో 14 భారత నగరాలుండగా, 2018 ఏడాదికిగానూ మరో నగరం చేరి ఆ సంఖ్య 15కు చేరడం  ఆందోళనకు గురిచేస్తోంది. అత్యంత కాలుష్య రాజధానులలో భారత రాజధాని ఢిల్లీ 113.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, అఫ్గానిస్థాన్ రాజధాని  కాబుల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో గురుగ్రామ్ (135.8) తొలి స్థానంలో నిలవగా, ఘజియాబాద్ (135.2) రెండో 
స్థానంలో ఉంది. పాక్ నగరం ఫైసలాబాద్ (130.4), ఫరీదాబాద్ (129.1), భివాడి (125.4) టాప్ స్థానాల్లో నిలిచాయి. కాలుష్యపూరిత నగరాల జాబితాలో టాప్ 5లో 4 భారత  నగరాలుండగా, టాప్ 10 విషయానికొస్తే మొత్తంగా 7 భారత నగరాలు జాబితాలో ఉన్నాయి. టాప్ 10లో చైనా నుంచి హోతాన్ (8), పాక్ నుంచి ఫైసలాబాద్తో పాటు లాహోర్  (10వ స్థానం) ఉన్నాయి. 

Related Posts