YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్

విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్
యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:   
ఆస్ట్రేలియాతో నాగ్పూర్ వేదికగా రెండో వన్డేలో అర్ధశతకం సాధించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్ సృష్టించాడు. 2014-15లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో  మహేంద్రసింగ్ ధోనీ నుంచి జట్టు పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ.. కెప్టెన్గా ఈరోజు అన్ని ఫార్మాట్లలో కలిపి 9,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. కేవలం 159  ఇన్నింగ్స్ల్లోనే విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని అందుకోగా.. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకూ ఏ జట్టు కెప్టెన్ ఇంత వేగంగా కనీసం 7 పరుగుల మార్క్ని కూడా  చేరుకోలేకపోయారు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా గతంలో 164 ఇన్నింగ్స్ల్లో 7వేల పరుగుల కెప్టెన్సీ రికార్డ్.. కోహ్లీ తర్వాత అత్యుత్తమంగా ఉంది. మొత్తంగా  అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకూ ఐదు మంది కెప్టెన్స్ మాత్రమే 9వేల పరుగుల మైలురాయిని అందుకోగా.. తాజాగా ఆరో కెప్టెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇప్పటికే  బ్యాట్స్మెన్గా వన్డే కెరీర్లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న కోహ్లీ.. టెస్టుల్లోనూ 6,600 పరుగులు చేసిన విషయం తెలిసిందే 

Related Posts