Highlights
- ఆలస్యమైతే నో ఎంట్రీ!
- ఉపాధ్యాయ నియామకాల రాత పరీక్షలు
- 8,792 పోస్టులకు 2,77,518 మంది అభ్యర్థులు
రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల రాత పరీక్షలను (టీఆర్‌టీ) రేపటి నుంచి మార్చి 4 వరకు నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శని, ఆదివారాల్లో జరిగే పరీక్షలకు సంబంధించి బయోమెట్రిక్ అథెంటికేషన్ వివరాల సేకరణకు సమయం పడుతుందని, అందుకే అభ్యర్థులు కచ్చితంగా 45 నిమిషాల ముందే పరీక్ష హాల్లోకి వెళ్లాలని వివరించింది. నిర్ణీత పరీక్ష సమయం కంటే ఆలస్యంగా వచ్చే అభ్యర్థులను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమ య్యే పరీక్షల కోసం అభ్యర్థులు 9:15 గంటలకే పరీక్ష హాల్లోకి వెళ్లాలని, మధ్యాహ్నం 2:30 గంటలకు మొదలయ్యే పరీక్షల కోసం అభ్యర్థులు 1:45 గంటలకే పరీక్ష హాల్లోకి వెళ్లాలని సూచించింది. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకెళ్లాలని పేర్కొంది. అభ్యర్థుల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఐదు కేటగిరీల్లో 48 రకాల సబ్జెక్టులు, మీడియంలలోని 8,792 పోస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,77,518 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు నిర్ణీత సమయంకన్నా ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది.
పరీక్షలు, హాల్‌టికెట్లకు సంబంధించి ఏమై నా సమస్యలుంటే టీఆర్‌టీ హెల్ప్‌డెస్క్‌ను 8333923740 నంబర్‌లో (ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు) సంప్రదించాలని లేదా హెల్ప్ డెస్క్ @tspsc.gov.inకు మెయిల్ చేయాలని సూచించింది. ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ వంటి రెండు పరీక్షలు మినహా మిగ తా వాటిని ఆన్‌లైన్లో నిర్వహిస్తున్నందున అభ్యర్థులు తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన లింకు (ఇన్‌స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఆన్ సీబీఆర్టీ ఎగ్జామినేషన్స్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ మాక్ టెస్టు) ద్వారా ప్రాక్టీస్ చేసుకోవాలని పేర్కొంది.