యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మంచినీటి ఎద్దడి నివారణ కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మంచినీటి సమస్య పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో ఒక జాయింట్ కలెక్టర్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై దృష్టి పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ మంచినీటి సరఫరా, పశుగ్రాసం పంపిణీకి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. భేటీ తరువాత మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివరించారు. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి కమ్యూనిటి హెల్త్ సెంటర్‌ను 50 పడకల స్థాయికి పెంపు, అదనంగా 17 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం ఇచ్చింది. హైకోర్టు పర్యవేక్షణలో దరఖాస్తుల విశ్లేషణ, నగదు పంపిణీ వేగవంతం చేయాలి., కరవు సాయంగా కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో నిధులు విడుదల లేదు. అరకొర సాయంతో ఇబ్బందులు. రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే తోడ్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అగ్రిగోల్డు వ్యవహారం లో ఫిబ్రవరి 8న హైకోర్ట్ ఆదేశాలకు అనుగుణంగా రూ.250కోట్ల (రూ.10వేల లోపు డిపాజిట్‌దారులందరికీ) విడుదల చేయాలని కుడా ఈ భేటీలో నిర్ణయించారు.