YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దినకరన్ కు వరుస కష్టాలు

దినకరన్ కు వరుస కష్టాలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తమిళనాడులో దినకరన్ కు కష్టాలు మొదలయ్యయనే చెప్పాలి. మేనత్త శశికళ జైలు నుంచి ఇస్తున్న సూచనలు అమలు చేయడమే దినకరన్ పని. అయితే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందనుకుంటే తాజా పరిణామాలతో అది కష్టసాధ్యమేనంటున్నారు. ఎందుకంటే తమిళనాడులో గుర్తు బలంగా పనిచేస్తుంది. నిన్న మొన్నటి వరకూ రెండాకుల గుర్తు కోసం దినకరన్ పార్టీ పోరాడింది. అయితే ఢిల్లీ హైకోర్టు మాత్రం రెండాకుల గుర్తును పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు సారథ్యం వహించే అన్నాడీఎంకే చెందేలా తీర్పునిచ్చింది. అయితే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.దినకరన్ వర్గానికి చెందిన దాదాపు 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. రానున్న లోక్ సభ ఎన్నికలతో పాటు 21 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంటు ఎన్నికలను పక్కన పెడితే ఈ ఉప ఎన్నికలు మాత్రం దినకరన్, శశికళలకు ప్రతిష్టాత్మకం. తమను నమ్మి వచ్చిన వారిని తిరిగి గెలిపించుకోలేకపోతే నాయకత్వంపై నమ్మకం పోతుంది. అయితే ఇందుకోసం కామన్ గుర్తును కేటాయించుకోవాలన్నది దినకరన్ ఆలోచన. ఇందుకోసం సుప్రీంకోర్టుకు మరోసారి రెండాకుల గుర్తు తమకు కేటాయించేలా చూడాలని దినకరన్ బ్యాచ్ కు వెళ్లనున్నారు.ప్రెషర్ కుక్కర్ గుర్తునైనా కామన్ గుర్తుగా తమ పార్టీకి కేటాయించాలన్నది దినకరన్ వ్యూహంగా కన్పిస్తుంది. ప్రెషర్ కుక్కర్ గుర్తుతోటే గతంలో జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. అన్నాడీఎంకే సోదిలో లేకుండా పోయింది. డీఎంకే కు డిపాజిట్లు కూడా రాలేదు. బీజేపీకి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. దీంతో తమ అభ్యర్థులందరికీ ప్రెషర్ కుక్కర్ గుర్తు అయినా ఉండేలా చూసుకునేందుకు దినకరన్ న్యాయవాదులతో మంతనాలు జరిపారు. ప్రెషర్ కుక్కర్ గుర్తును కూడా కేటాయించడానికి ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని దినకరన్ నిర్ణయించారు.అనర్హత వేటు పడిన కొందరు ఎమ్మెల్యేలు రెండాకుల గుర్తు రాకపోవడంతో అసహనంతో ఉన్నారు. గుర్తు లేకుంటే ఉప ఎన్నికల్లో కష్టమని భావించిన వీరు డీఎంకే వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ స్థాపించినప్పుడు కూడా దినకరన్ వర్గీయులుగా ముద్రపడిన ఎమ్మెల్యేలు ముందు పార్టీ కాదని, గుర్తు కోసం పోరాడాలని సూచించారు. రెండాకుల గుర్తు వస్తే అమ్మ ఆశీర్వాదమూ ఉంటుందని వారు చెప్పారు. కానీ రెండాకుల గుర్తు రాదని తేలిపోయింది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ గుర్తు కోసం దినకరన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అది వచ్చినా ఇప్పుడు దినకరన్ వెంట నడిచే వారు పార్టీ మారడం ఖాయమన్న ప్రచారం తమిళనాడులో జరుగుతోంది. దినకరన్ మాత్రం అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ క్యాడర్ లో భరోసా నింపే ప్రయత్నాలు చేస్తున్నారు.

Related Posts